రూ. 300కోట్ల వ‌సూళ్ల‌తో ‘దంగ‌ల్’ రికార్డ్ బ్రేక్

Dangal, Dangal Movie, Dangal Collections

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్ త‌ను న‌టించిన దంగ‌ల్ చిత్రం అద్భుతంగా ఉంది అనేక‌మంది సినీ హీరోలు, హీరోయిన్లు, ప్ర‌ముఖులు మ‌న్న‌న‌లు చూర‌గొంది. సినీ హీరోలు సైతం ప్ర‌శంసించ‌లేకుండా ఉండ‌లేక‌పోతున్నామంటూ త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్త‌ప‌ర‌చ‌డం విశేషం. వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ అమీర్ ఖాన్ ప్ర‌తిభ‌ను మెచ్చి ఆయ‌న కాళ్ల ను తాకాల‌ని ఉంది అని కింతాబిచ్చారు. అదేవిధంగా ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మెచ్చుకోకుండా ఉండ‌లేక‌పోతున్నానంటూ ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. ఈ సినిమా తాజాగా 13 రోజుల్లోనే రూ. రూ.300 కోట్ల క్లబ్‌లో చేరింది. అంతేకాకుండా బాలీవుడ్ సినీ చ‌రిత్ర‌లో 300 కోట్ల క్లబ్‌లో చేరిన నాలుగో చిత్రంగా రికార్డ్ సృష్టించింది. ఇప్పటి వరకూ కండ‌ల‌వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన ‘సుల్తాన్’, ‘బజ్‌రంగి భాయ్‌జాన్’, అమీర్ ఖాన్ హీరోగా న‌టించిన ‘పీకే’ చిత్రం ఈ టాప్ క్లబ్‌లో ఉన్నాయి. ‘దంగల్’ను సైతం ఆ బరిలోకి తీసుకురావడం ద్వారా సల్మాన్ బాయ్ రికార్డును అమీర్‌ సమం చేసిన ఘ‌న‌త ద‌క్కింది.

‘దంగల్’ రికార్డు కలెక్షన్లను ప్రముఖ ట్రేడ్ విశ్లేషకులు తరన్ ఆదర్శ్ ఒక ట్వీట్‌లో ధ్రువీకరించారు. రెండో రోజు రూ.50 కోట్లకు చేరుకున్న ఈ మూవీ కలెక్షన్లు, మూడో రోజుకు రూ.100 కోట్లు చేరుకోవ‌డం విశేషం. అదేవిధంగా ఐదో రోజుకు ‘150’ కోట్లు, 8వ రోజుకు రూ.200 కోట్లు, 10వ రోజుకు రూ.250 కోట్లుకు చేరుకున్నాయి. ప‌ద‌మూడో రోజు పూర్తయ్యే సరికి సినిమా రూ.300 కోట్లు వ‌సూళ్లు చేసి అరుదైన ఘ‌న‌త‌ను సాధించింది. ఆసక్తి కరంగా అమీర్ నటించిన ‘పీకే’ చిత్రం 17 రోజుల్లో ఈ రికార్డు సాధిస్తే.. దంగ‌ల్ 13 రోజుల‌కే ఆ రికార్డును కైవ‌సం చేసుకోవ‌డం విశేషం.

Leave a Reply

*