ఎన్టీఆర్‌తో రొమాన్స్‌కు సిద్ధ‌మ‌య్యే ఆ ముగ్గురు హీరోయిన్లు ఎవ‌రో ?

actress readt to romance with jr ntr

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా ప్ర‌ణాళిక‌లు వేగవంతం అవుతున్నాయి. ‘జనతా గ్యారేజ్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్ అందుకున్న త‌ర్వాత చాలా మంది ద‌ర్శ‌కుల క‌థలు విన్నాడు. అయిన‌ప్ప‌టికీ చాలా ఆల‌స్య‌మైన‌ప్ప‌టికీ మంచి క‌థ కోసం వెతుకులాట ప్రారంభించి చివ‌ర‌కు బాబి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తీయ‌డానికి ఫిక్స్ అయ్యాడు. ఇప్పుడు ఈ సినిమాకు  ‘జై లవ కుశ’ అనే టైటిల్‌ను సిద్ధం చేస్తున్నారు.  ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ తర్వాత బాబి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.  ఈ సినిమాలో తార‌క్‌ మూడు పాత్రల్లో మెరిపించ‌నున్నాడు. త‌న అన్న‌య్య నందమూరి కల్యాణ్‌రామ్‌ ఈ చిత్రానికి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే..  తన ఎన్టీయార్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మిస్తున్నాడు.

ఈ సినిమా ప‌నులు వేగవంతంగా జ‌రుగుతున్న‌ప్ప‌టికీ తార‌క్ స‌ర‌స‌న రొమాన్స్ చేసే ముగ్గురు హీరోయిన్లను సెలెక్ట్ చేయ‌డ‌మే చిత్రబృందానికి పెద్ద స‌మ‌స్య‌గా మారింద‌ట. ముగ్గురు టాప్ హీరోయిన్ల‌ను ఎంపిక చేస్తే… వారంద‌రి డేట్లు  ఒకేసారి కావాలంటే చాలా కష్టమైన ప‌రిస్థితి.   ప్రస్తుతం  హీరోయిన్లంద‌రూ బిజీబిజీగానే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో మొదట రకుల్‌, శృతీహాసన్‌ కోసం ప్రయత్నించారు. కానీ, వారి డేట్లు ఖాళీగా లేవని తెలిసింది.  దీంతో ఓ నిర్ణ‌యానికి వ‌చ్చార‌ట చిత్ర బృందం. తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం లీడింగ్‌లో ఉన్న ఐదుగురు హీరోయిన్లను ఎంపిక చేసి.. వారిలో తమకు అనుకూలంగా డేట్లు అడ్జెస్ట్‌ చేయగలిగే వారే  హీరోయిన్లగా ముగ్గురిని  ఫైనలైజ్‌ చేస్తారని టాక్‌.   ప్రస్తుతానికి ఎంపిక చేసిన ఆ ఐదుగురు హీరోయిన్ల‌లో  కాజల్‌, కీర్తీ సురేశ్‌, అనుపమ పరమేశ్వరన్‌, నివేదా థామస్‌, రాశీ ఖన్నా. వీరిలో వరుసగా 25 రోజులు డేట్లు ఇవ్వగలిగే వారే తార‌క్ స‌ర‌స‌న రొమాన్స్ చేయ‌డానికి  అవ‌కాశం దక్కుతుంది. మరి, ఆ ముగ్గురు భామలు ఎవరో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి.

Leave a Reply

*