పిల్లల్ని కనడానికి లైసెన్స్ ఉండాలంటున్న‌ముద్దుగుమ్మ‌

actress Sanjana sensational comments, actress Sanjana, Sanjana,

పిల్లల్ని కనడానికి తల్లులకు లైసెన్స్ ఉండాలని నటి సంజన అభిప్రాయ‌ప‌డింది. ఈ భామ కోలీవుడ్‌కు కాదల్‌ సెయ్‌వీర్‌ చిత్రం ద్వారా పరిచయం అయింది. తమిళం, తెలుగు, కన్నడ తదితర భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా గుర్తింపు పొందింది. తమిళంలో పాపులర్‌ అయిన నటి నిక్కీగల్రాణి సోదరి అయిన సంజన అందిరి వ‌లే తన గురించి, తన చిత్రాల గురించి కాకుండా పిల్ల‌ల విష‌యంలో ఒక వినూత్న భావాన్ని వ్యక్తం చేశారు. పిల్ల‌ల‌ను క‌నే ప‌ద్ధ‌తిలో ఆమె ఏమంటుందో చూద్దాం. మోటార్‌ వాహనాలు నడపడానికి లైసెన్స్ త‌ప్ప‌నిస‌రి ఉంటుంది. వ‌స్తువుల ఉత్పత్తులకు, వాటి విక్రయాలకు లైసెన్స్ కావలసి ఉంటుంది. పిల్లల్నికనడానికి తల్లులకు లైసెన్స్ విధానం అవసరం.

చాలా మంది తల్లులు పిల్లల్ని క‌నేసి వారితో బిచ్చమెత్తిస్తున్నారు. కొందరైతే చంటి పిల్లల్ని సంకనేసుకొని అడుక్కు తింటున్నారు. మరికొంత‌మంది మహిళలు పిల్లల్ని అద్దెకు తెచ్చుకుని మ‌రీ బిచ్చమెత్తుకుంటున్నారు. ఇంకొంత‌మంది సంపాదన కోసమే పిల్లల్ని కంటున్నారు. అంత‌టి నీచాతినీచ‌మైన తల్లులకు లక్ష రూపాయలు ఇచ్చి ఇకపై పిల్లల్ని అడుక్కునే వారిగా తయారు చేయకండి అని చెప్పినా వారిలో ఎటువంటి మార్పురాదు. మండే ఎండల్లో రోడ్ల పక్కన జీవ‌చ్ఛ‌వాల్లా పడిఉన్న అటువంటి పిల్లల్ని చూస్తుంటే దుఃఖం పొంగుకొస్తుంది. వారికి తినడానికి అన్నం, కట్టుకోవడానికి సరైన బట్టలు కూడా ఉండవు.

ఈ విధంగా చాలా మందిని బాల కార్మికుల్లా మారుస్తున్నారు. అటువంటి బాల కార్మికులు తయారవ్వకుండా ఉండాలంటే పిల్లల్ని కనడానికి తల్లులకు లైసెన్స్ విధానం అమ‌లు చేయాలి. స్త్రీలకు పిల్లల్ని కని పెంచే స్తోమత ఉందా అని విచారించి అందుకు లైసెన్స్ ఇవ్వాలంటున్నారు. అలా లైసెన్స్ లేని వారు పిల్లల్ని కంటే తగిన శిక్ష విదించాలి అని వ్యాఖ్యలు చేశారు. తాను ఇటీవల ప్రధాని నరేంద్రమోదీని కలిసినప్పుడు పిల్లలను కనడానికి తల్లులకు లైసెన్స్ విధానాన్ని ప్రవేశ పెట్టాలని విజ్ఞప్తి చేసినట్టు నటి సంజన పేర్కొంది. విన‌డానికి ఈ విష‌యం చాలా సింపుల్‌గా చెప్పిన‌ప్ప‌టికీ న‌టి సంజ‌న్ చాలా సీరియ‌స్‌గానే తీసుకుంద‌నిపిస్తుంది.

Leave a Reply

*