పులోమావి ప్రేమకథతో మోక్షజ్ఞ రంగ‌ప్ర‌వేశం !

balakrishna movie entry news tollywood

నందమూరి హీరో బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశానికి స‌మ‌యం ఆస‌న్న‌మ‌వుతుంది. ఇప్ప‌టికే మోక్ష‌జ్ఞ న‌టించి తొలి చిత్రం ఎటువంటిది వ‌స్తుంద‌ని అభిమానులు వెయ్యిక‌ళ్ల‌తో ఆస‌క్తి గా ఎదురుచూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఓ చారిత్రక కథ ద్వారానే అతడి ఎంట్రీ ఉంటుందని బాల‌కృష్ణ డిసైడ్‌ చేశాడు. అయితే ఆ చారిత్రక కథ ఎలా ఉంటుంది.. ఏమై ఉంటుంది ? అనే దానిపైనే ఫిల్మ్‌నగర్‌లో ఆసక్తికర కథనాలు వినిపించ‌డం మొద‌లు పెట్టాయి. ఓ వైపు గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ద్వారా బాల‌కృష్ణ భారీ విజయాన్ని అందుకుని మంచి జోష్ మీదున్నాడు. ఆ శాతకర్ణి కుమారుడు పులోమావి కథనే సినిమాగా తీయాలని బాలయ్యబాబు నిర్ణయించాడని స‌మాచారం. శాతకర్ణి సినిమా అంతా.. యుద్ధ నేపథ్యంలో సాగింది.. కాబట్టి యంగ్ హీరో మోక్షజ్ఞ మూవీ ప్రేమకథా నేపథ్యంలో తీస్తారని తెలుస్తోంది. చారిత్రక సినిమాలో ప్రేమకథా నేపథ్యమేంటని సందేహం రావ‌చ్చు… అయితే వ‌శిష్టి శాతకర్ణి పుత్ర పులోమావి.. శ్రావణి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు.

దీనిపైనే చారిత్రక అంశాల ఆధారాల‌ను జోడించి ర‌స‌వ‌త్త‌ర‌మైన ప్రేమక‌థా సినిమాగా మలుస్తారని అంటున్నారు. వారి ప్రేమకథ ఆధారంగా ప్రముఖ రచయిత ముదిగొండ శివప్రసాద్ రచించిన ‘శ్రావణి’ నవలను ఆధారంగా చేసుకుని మూవీ తీయాల‌ని భావిస్తున్నార‌ని ఫిల్మ్‌నగర్ వర్గాల టాక్. ‘శ్రావణి’ నవల ఒక్కటే కాదు.. పలు చారిత్రక ఆధారాలను కూడా సేకరించి అందులో ఉండేలా చేస్తార‌ట‌. సినిమాకు ఆ నవల టైటిల్‌నే పెడతారని టాక్. మరి, ఆ సినిమాను తెరకెక్కించే డైరెక్టర్ ఎవరు ? అనేది పెద్ద ఆస‌క్తిక‌ర‌మైన అంశం. గౌతమిపుత్ర శాతకర్ణిని అత్య‌ద్బుతంగా మలచిన ద‌ర్శ‌కుడు క్రిష్.. ఈ సినిమాకు కూడా ద‌ర్శ‌క‌త్వం చేస్తాడట. దీనిపై ఇప్పటికే క్రిష్‌తో బాలయ్య చర్చించాడని స‌మాచారం. తన తనయుడి సినిమా బాధ్యతను మొత్తం క్రిష్ భుజాలపైనే బాలయ్య పెట్టాడని తెలుస్తోంది. దాదాపు ఆ సినిమా కన్ఫర్మ్ అయిందని ప్రేమ‌క‌థా రూపంలో తెర‌కెక్కించే బాధ్య‌త క్రిష్‌కే అప్ప‌గించార‌ని టాక్‌. పూర్తి వివ‌రాల‌కు మ‌రికొద్ది రోజులు ఆగి చూడాలి.

Leave a Reply

*