చిరు 151వ‌ సినిమాపై స్టార్ క‌మెడియ‌న్ ధీమా !

Chiranjeevi 151st, Chiranjeevi, Ram Charan

బాయిలింగ్ స్టార్ బబ్లూ కేరక్టర్ తో స్టార్ కమెడియన్ జాబితాలో స్థానం సంపాదించుకున్నాడు పృథ్వీ. ఇటీవ‌ల విడుద‌ల‌వుతున్న‌సినిమాల‌లో చాలా ఎక్కువ స‌మ‌యం కామెడీతో న‌వ్విస్తున్నాడు. సినిమా సినిమాకి ప్రాధాన్యం పెర‌గ‌డంతో మంచి క్రేజ్‌ను సంపాదించుకుని కామెడీ పాత్ర‌ల‌కు పృథ్వీ త‌ప్ప‌నిస‌రి అనే రేంజ్‌లోకి చేరుకున్నాడు. అయితే తాజాగా మెగాస్టార్ కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 విషయంలో ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. అదేమిటంటే.. చిరు 150వ సినిమాలో తాను నటించినా.. తన పాత్రను పూర్తిగా తొలగించేశార‌ని తెలియ‌డంతో పండగపూట అమ్మ చనిపోయింనత బాధగా ఉందని కామెంట్ చేశాడు.

ఈ కామెంట్ ప్ర‌స్తుతం ఇండస్ట్రీలో దుమారం రేపడంతో వాటిపై సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నించాడు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ క‌మెడియ‌న్ పృథ్వీ. ‘మెగాస్టార్ చిరంజీవి పక్కన నిలబడ్డమే ఓ అదృష్టం.. ఆయనతో ఫోటో దిగడం అంటే ఇంకా అదృష్టం. కలిసి నటించడం అంటే ఇంకా ఇంకా పెద్ద అదృష్టం. అని అన్నారు. ఓ వెబ్ సైట్ లో ఖైదీ 150 లో నా సీన్స్ తీసేశారు.. అని చూసి ఆ కథనం రాగానే కో-డైరెక్టర్ కు ఫోన్ చేసి విషయం తెలుసుకున్నాను. అయితే సినిమా కథకు.. తన పాత్రకు సంబంధం లేకపోవడంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితిలో ఇలా చేయాల్సి వచ్చిందనే విషయం తెలుసుకున్నట్లు తెలిపాడు. పూర్తి వివ‌రాలు తెలుసుకున్న త‌రువాత పృథ్వీ మాట్లాడుతూ ‘మెగాస్టార్ సినిమాలో నటించడం అదృష్టం.. కనిపించకపోవడం దురదృష్టం అంతే.

అన్న పృథ్వీ.. చాలా సినిమాల్లో ఇటువంటి జ‌ర‌గ‌డం స‌హ‌జ‌మైన విష‌య‌మే.. ఆ మాత్రానికి పెద్దగా మనసులో పెట్టుకోవాల్సిన పనే ఉండదని త‌మాయించుకున్నాడు. చిరు 150వ మూవీ 175 రోజులు ఆడాలని కోరుకునే మొదటి వ్యక్తుల్లో తానూ ఒక‌డిన‌ని చెప్పిన ఈ కమెడియన్.. ఒక‌ప్పుడు చిరంజీవి సినిమా విడుద‌ల అంటే.. ప‌శ్చిమ‌గోదావ‌రి లోని తాడేపల్లి గూడెంలో ఉన్నపుడు తెల్లవారుజామునే మూడు గంటల నుంచి థియేటర్ల దగ్గరే ఉండేవాడినని చెప్పాడు. 150 కాకపోతే.. 151లో అయినా చిరంజీవి పక్కన కనిపించే అదృష్టం తనకు వస్తుందంటూ…. ధీమా వ్య‌క్తం చేశాడు. త‌ప్ప‌నిస‌రిగా 151వ సినిమా అవ‌కాశం దొరుకుతుంద‌ని ఆశ‌ప‌డుతున్నాడు. సో.. ఏది ఏమైన‌ప్ప‌టికీ అసలు ఇందులో ఎలాంటి వివాదం లేదని తేల్చేశాడు.

Leave a Reply

*