‘శాతకర్ణి’ ని చూసి ఆశ్యర్యపోయానంటున్నమ్యూజిక్ డైరెక్ట‌ర్!

Chirantan Bhatt about Gautamiputra Satakarni, Chirantan Bhatt, Gautamiputra Satakarni, Gautamiputra Satakarni Movie, Balakrishna, Shriya

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ న‌టించిన గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి మూవీకి ముందుగా మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా దేవీశ్రీ ప్ర‌సాద్‌ను అనుకున్నారు. ఇక ఆ త‌రువాతో ఏవేవో కార‌ణాల‌తో మొత్తం అత‌ను త‌ప్పుకున్నాక‌.. ఆ స్థానంలో ఈ సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌గా చిరంతన్‌ భట్ కు అవ‌కాశం వ‌చ్చింది. చిరంత‌న్ భ‌ట్ ఇంతకు ముందే క్రిష్‌ దర్శకత్వం వహించిన ‘కంచె’ సినిమాకి మ్యూజిక్‌ డైరెక్టర్‌గా వ్యవహరించిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఇప్పుడు బాలయ్య ప్రెస్టేజియస్‌ మూవీ ‘శాతకర్ణి’కి మ్యూజిక్‌ అందించే అవకాశం వ‌చ్చింది. ఆయన అందించిన పాటలు ఇప్పటికే మంచి గుర్తింపును పొందాయి. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ ‘ఇలాంటి ఓ పీరియాడిక్‌ సినిమాకు సంగీతం అందించడం కష్టమే. అప్పటి కాలానికి తగ్గట్టు ఉండాలి. ఇప్పటి యూత్‌కు కనెక్ట్‌ కావాలి.

పైగా చాలా పాటలు తక్కువ సమయంలో పూర్తి చేయాల్సి వచ్చింది. ఇది నాకు సవాలుగా నిలిచింది. ఆడియోను ఆదరిస్తున్నందుకు చాలా సంతోషం. సీతారామశాస్త్రి గారి లాంటి దిగ్గజంతో పని చేయడం ఈ సినిమా ద్వారా ల‌భించ‌డం నా అదృష్టం. ఆడియోకు సంబంధించి సగం క్రెడిట్ ఆయనకు దక్కుతుంద‌న్నారు. ఇక రీ రికార్డింగ్ లో భాగంగా సినిమా చూసినపుడు ఆశ్చర్యపోయాను. క్రిష్ సినిమాను తీసిన తీరు అద్భుతం అన్నారు. వార్ సీక్వెన్స్ లో విజువల్ గ్రాండియర్ కళ్లు చెదిరిపోయేలా చేసింది. అల‌యితే వాటన్నింటికంటే కూడా కంటెంట్.. ఎమోషన్స్ కీలకపాత్ర పోషిస్తాయ‌ని చెప్పారు. ఈ స‌న్నివేశాల‌తో ప్రేక్షకులు బాగా కనెక్టవుతారు’’ అని చిరంతన్ తెలిపాడు.

Leave a Reply

*