‘వంగవీటి’ మూవీ వర్మతోనే సాధ్య‌మ‌న్న ‘దాస‌రి’

Dasari About RGV & Vangaveeti Movie, Dasari Narayana Rao, RGV, Vangaveeti Movie

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల‌వ‌ర్మ మాత్ర‌మే య‌థార్థ సంఘ‌ట‌న‌లను ర‌క్తి క‌ట్టించ‌గ‌ద‌ల‌ర‌ని, బాగా డీల్ చేయ‌గ‌ల‌ర‌ని, ఆయ‌న త‌ప్ప మ‌రో ద‌ర్శ‌కుడు హ్యాండిల్ చేయ‌లేర‌ని, మ‌న దేశంలో అటువంటి డైరెక్ట‌ర్ మ‌రొక‌రు లేర‌ని సినీ వంగ‌వీటి సినీ నిర్మాత దాసరి కిరణ్‌కుమార్ అన్నారు. రామదూత క్రియేషన్స్ పతాకంపై రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో ఆయన నిర్మించిన చిత్రం ‘వంగవీటి’. రెండో వారంలోనూ విజయవంతంగా థియేట‌ర్ల‌లో ప్ర‌దర్శితమవుతోన్న ఈ సినిమా గురించి సంస్థ కార్యాలయంలో ఆయ‌న మాట్లాడారు ‘‘ఈ సినిమా ప్రారంభించిన‌ప్ప‌టి నుంచి విడుదలయ్యే వ‌ర‌కు అనేక సమస్యలు ఎదురయ్యాయి.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ‘వంగవీటి’ అనే టైటిల్‌ను రిజిస్టర్‌ చేయడానికి తెలుగు ఫిల్మ్‌చాంబర్‌ ఒప్పుకోకపోవడం అనే విష‌యం ఇప్ప‌టికీ నాకు అర్థంకానిదిగా మిగిలింద‌న్నారు. తెలంగాణ ఫిల్మ్‌చాంబర్‌ వాళ్లు ఎటువంటి అభ్యంతరం తెలపకుండా రిజిస్టర్‌ చేశార‌న్నారు. ఇక ఆ తర్వాత కొంతమంది ఈ సినిమాపై కోర్టులో కేసులు వేస్తే, ఇంకొంతమంది సెన్సార్‌ బోర్డుకు ఫిర్యాదులు కూడా చేశారు. ఇక ఎంతో ర‌చ్చ‌రచ్చ అయిన విష‌యం తెలిసిందే. ఎట్ట‌కేల‌కు వాటి నుంచి బయటపడ్డాం. విజయవాడలో వంగ‌వీటి సినిమా ఆడియో వేడుక నిర్వహించాలనుకుంటే కూడా అనుమతి లభించలేదు. కె.ఎల్‌. యూనివర్శిటీ వాళ్లు ముందుకొచ్చారు కాబట్టి వాళ్ల గ్రౌండ్‌లో ఆ వేడుక‌ను ఘ‌నంగా నిర్వహించాం. ఈ విధంగా అడుగడుగునా ఎదురైనా ఆటంకాల్ని అధిగమించి సినిమాను విడుదల చేయ‌డంలో స‌క్సెస్ అయ్యాం.

విడుదల సమయంలో థియేటర్ల వద్ద ఎటువంటి గొడవలు జరగకుండా ఆంధ్రప్రదేశ పోలీసులు అందించిన సహకారం కూడా మరవలేనిద‌న్నారు. ఎలాంటి ఫైనాన్స్‌ తీసుకోకుండా కేవలం నా సొంత డబ్బులతోనే ఈ సినిమాను తీశాను. డబ్బుపెట్టి సమస్యలు కొనితెచ్చుకోవాలని ఎవరూ అనుకోరు. ఇప్పటికీ చాలా చోట్ల హౌస్‌ఫుల్‌ కలెక్షన్లు ఉండటంతో మా కష్టానికి తగిన ఫలితం లభించినట్లయింది. సినిమా విడుదలయ్యాక రాధా, రంగా, నెహ్రూ అభిమానులు సినిమాను చూసి మెచ్చుకున్నారే కానీ బాగా లేదని ఎవరూ చెప్ప‌లేద‌న్నారు’’ అని ఆయన తెలిపారు.

Leave a Reply

*