మూవీ రేటింగులపై దాసరి షాకింగ్‌ వ్యాఖ్యలు

Dasari Shocking Comments on Movie Ratings, Dasari Shocking Comments, Dasari, Dasari Narayan Rao

ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌కు పెట్టింది పేరు. ఈయ‌న ఏమి మాట్లాడినా చాలా స్మూత్‌గా మాట్లాడిన‌ట్టు క‌నిపించిన‌ప్ప‌టికీ ఎవ‌రికి త‌గ‌లాలో వారికి మాత్రం చాలా ఘాటుగా త‌గులుతుంది. అంత‌టి రాజ‌కీయప‌రిప‌క్వంతో మాట్లాడుతూ బాణాలు సందిస్తారు. ఈ సారి బాణం ఓ వ‌ర్గం మీడియాపై ఎక్కుపెట్టారు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సక్సెస్ మీట్ కు ముఖ్య అతిథిగా హాజరైన దాసరి ఈ వ్యాఖ్యలు చేశారు. మీడియాలో సినిమాలకు ఇచ్చే రేటింగుల విషయంలో పెద్ద బ్లాక్ మెయిలింగ్ నడుస్తోందంటూ ఆయ‌న సంచలన వ్యాఖ్యలు చేశారు. మూవీల‌కు రేటింగులిచ్చే విషయంలో మీడియా చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన హితవు పలికారు. ‘‘అప్పట్లో ఒకడుండేవాడు వంటి సినిమాలకు మీడియా సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అయితే మీడియాలోనూ ఒకట్రెండు చీడపురుగులు ఉన్నాయంటూ విరుచుకుప‌డ్డారు. డ‌బ్బుల కోసం రేటింగులతో బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇటువంటి వాటిని ఎంతో కాలం భరించలేరు. రేటింగ్స్ మీద చాలా జీవితాలు ఆధారపడి ఉన్నాయనే సంగ‌తిని గుర్తుంచుకోవాలి.

చాలా బాధ్యతతో రాయాలి.. దానికి త‌గ్గ‌ట్టుగానే రేటింగులివ్వాలి. ముఖ్యంగా ఓవర్సీస్ లో రేటింగ్స్ ప్రభావం అధికంగా ఉంటుందనే విషయాన్ని గ్రహించాలి. నేనీ విషయాన్ని సదుద్దేశంతోనే చెబుతున్నా’’ అన్నారు దాసరి చెప్పారు. ఓ మంచి సినిమాకు సహకారం అందించేందుకు త్వరలోనే గుడ్ ఫిల్మ్ ప్రమోటర్స్ పేరుతో ఆరుగురితో ఒక టీం ఏర్పాటు చేస్తాన‌ని ఆయన తెలిపారు. ఇక ‘అప్పట్లో ఒకడు ఉండే వాడు’ సినిమా చాలా బాగుందన్నారు. నారా రోహిత్ మంచి కథలతో ముందుకు వెళుతున్నాడ‌ని.. శ్రీవిష్ణు కూడా చాలా చక్కగా చేశాడని దాసరి కితాబిచ్చారు.

Leave a Reply

*