సింగిల్ కట్ లేకుండా దూసుకొస్తున్న ‘శాత‌క‌ర్ణి’

Gautamiputra Satakarni, Gautamiputra Satakarni Movie, Balakrishna, Shriya

సంక్రాంతి సంద‌డి చేయ‌డానికి నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ సిద్ధ‌మ‌యిపోతున్నాయి. త‌న వందో సినిమాను అత్యంత‌ప్ర‌తిష్టాత్మ‌కంగా పూర్తిచేసుకుని ద‌ర్శ‌కుడు క్రిష్ జాగ‌ర్ల‌మూరి తెర‌కెక్కించిన సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. ఈ సినిమాలో ఒక్క క‌ట్ కూడా లేకుండా సెన్సార్ పూర్తి చేసికుని సంక్రాంతికి దూసుకొస్తుంది. ఈ చారిత్ర‌క మూవీలో బాలకృష్ణ సరసన శ్రియ‌ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో వీరమాత గౌతమిగా బాలీవుడ్ ప్రముఖ నటీమణి.. ఎంపీ హేమమాలిని అల‌రించారు. ఈ సినిమాన్ని వీక్షించిన సెన్సార్ సభ్యులు ఒక్కకట్ కూడా చెప్పకుండా యూ/ఈ సర్టిఫికేట్ ను జారీ చేశారు. సెన్సార్ స‌భ్యులు ఈ సినిమాను చూసిన అనంతరం చిత్ర బృందానికి అభినందనలు తెలియ‌జేసిన‌ట్టుగా చెబుతున్నారు.

భారీ ఎత్తున తెర కెక్కించిన యుద్ధ సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని సెన్సార్ స‌భ్యులు సూచించిన‌ట్టు చెబుతున్నారు. శాలివాహన శకం నేపథ్యంలో తీసిన ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ ఒక దృశ్యకావ్యంగా తీసినట్టుగా చెప్పారు. సెన్సార్ సభ్యుల ఫీడ్ బ్యాక్ ప్రకారం.. ఈ సినిమా బాలయ్య ఫ్యాన్స్ కు మాత్రమే కాదు.. ప్రతి తెలుగువాడి దృష్టిని ఆకర్షించటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. అయితే సెన్సార్ స‌భ్యులు చెప్పిన మాట‌లు ఎంత‌వ‌ర‌కు నిజ‌మ‌నేది తెలియాలంటే మ‌రో వారం రోజుల్లో విష‌యం బ‌య‌ట‌ప‌డుతుంది. మిగిలిన వారి అనుమానాలు ప‌టాపంచ‌లు కావ‌డం ఖాయం అని సినీ జ‌నాలు అంటున్నారు. ఈ నెల 12న భారీ ఎత్తున ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్న సంగ‌తి తెలిసిందే..

ఇప్ప‌టి నుంచే అభిమానులు థియేట‌ర్ల వ‌ద్ద హ‌డావుడి చేయ‌డం మొద‌లు పెట్టేశారు. ఇక ఈ సినిమా విడుద‌ల రోజున ఏ రేంజ్‌లో హ‌డావుడి ఉంటుందో వేచి చూడాలి. ఓ వైపు చిరంజీవి సినిమాని దాటుకుంటూ త‌న రుద్ర‌రూపాన్ని బాల‌కృష్ణ ప్ర‌ద‌ర్శిస్తాడ‌ని అభిమానుల‌తో పాటు ద‌ర్శ‌కుడు కూడా మంచి ప‌ట్టుద‌ల‌గా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

*