ఫ్లాష్ : ఫ్లాష్ : ఓవర్సీస్‌లో శాతకర్ణికి రికార్డు స్థాయి థియేట‌ర్లు

Gautamiputra Satakarni Overseas Rights Sold For Huge Price, Gautamiputra Satakarni Overseas Rights, Gautamiputra Satakarni Movie, Gautamiputra Satakarni, NBK100, Balayya Babu, Shriya, Hema Malini

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన వందో చిత్రం ‘గౌతమిపుత్రా శాతకర్ణి’ కోసం అశేష తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌తో పాటు ప్ర‌వాస భారీతీయులు కూడా ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన సాంగ్స్‌, ట్రైల‌ర్‌తో సినిమాపై అంచ‌నాల‌ను మ‌రింత పెరిగిపోయాయి. సంక్రాంతి పండుగ‌కు విడుద‌ల‌కు సిద్ధ‌మై ప్రేక్ష‌కుల‌ను క‌నువిందు చేయ‌డానికి వ‌చ్చేస్తుంది. మ‌రో కొద్దిరోజుల్లో థియేటర్స్ లోకి వ‌చ్చేస్తున్నాడు శాతకర్ణి. మ‌రోవైపు ఓవర్సీస్ లో బాలయ్యకు మామూలు ఫాలోయింగ్ లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని, అమెరికాలో భారీగా థియేటర్స్ ను కొనుగోలు చేసింది. దాదాపు 180కి పైగా థియేటర్స్ లో శాతకర్ణి సందడి చెయ్యబోతోంది. బాల‌కృష్ణ గత చిత్రాలకు ఎప్పుడూ కూడా ఈ రేంజ్ లో థియేటర్ల‌ను తీసుకోలేదు.

ఒక చారిత్రాత్మక చిత్రం కావడం, దీనికి క్రిష్ దర్శకత్వం తోడవ్వడంతో ఈ సినిమాపై మ‌రింత హైప్ క్రియేట్ అయింది. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని నందమూరి అభిమానులు విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర‌ప‌డ‌డంతో హ‌డావుడి మొదలుపెట్టేశారు. జనవరి 12న విడుద‌లవుతున్న శాతకర్ణి, ఒకరోజు ముందుగానే అంటే..జనవరి 11న ఓవర్సీస్ లో భారీగా విడుద‌ల కానుంది. బాలీవుడ్ సీనియర్ నటి హేమమాలిని, శ్రియ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా విడుద‌ల త‌రువాత ఎన్ని రికార్డ్స్ బద్దలు కొడుతుందో, ఎంత రికార్డు దిశ‌గా వ‌సూళ్లు రాబ‌డుతుందో వేచి చూడ‌డ‌మే ప్రేక్ష‌కుల వంతుగా మారేట్టు ఉంటుంది.

Leave a Reply

*