నన్నెవరూ తొక్కేయలేరంటూ న‌టి కామెంట్ !

Hema Aunty Comments on Her, Hema Aunty, Actor Hema, Hema

టాలీవుడ్‌లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ హేమ ఓ ప్ర‌త్యేకమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఎటువంటి కామెడీ పాత్ర‌లను చేయ‌డంలో అయినా ఆమెది అందెవేసిన చేయి. డేరింగ్ అండ్ డాషింగ్‌కు మారుపేరు హేమ. హేమ చాలా ధైర్యంగా గ‌ట్టిగా మాట్లాడ‌తుంద‌న్న సంగ‌తి తెలిసిందే.. ఆమె త‌న త‌ప్పులేక‌పోతే ఎవ్వ‌రిని అయినా ఇండ‌స్ట్రీలో నిల‌బెట్టి నిగ్గ‌దీస్తుంద‌న్న టాక్ కూడా ఉంది. ఏపీలోని తూర్పుగోదావ‌రి జిల్లా కోన‌స‌మీలోని రాజోలుకు చెందిన హేమ తెలుగు సినిమాల్లో త‌న‌దైన కామెడీ, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తోంది. తాజాగా ఆమె మాట్లాడుతూ త‌న‌కు సినిమాల్లో అవ‌కాశాలు రాకుండా చేయ‌లేర‌ని ధీమాగా చెబుతుతోంది. ఇటీవ‌ల ఏపీలోని కాకినాడ‌లో ఆమె కాపుసంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కాపుసదస్సు’లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ సమావేశంలో పాల్గొన్నందుకు కక్ష సాధింపు చర్యలుగా తనను సినీరంగంలో ఎవరూ తొక్కేయలేరని వ్యాఖ్యానించారు. సినీ రంగం నుంచి వచ్చిన కొందరు ఈ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఇంకా నటిహేమ మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గత ఎన్నికలకు ముందు కాపుల రిజర్వేషన్లపై స్ప‌ష్ట‌మైన హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీని నెరవేర్చాలనే తాము కోరుతున్నామని తెలిపారు.

‘కాపు’ల న్యాయమైన డిమాండ్‌ను తీర్చడంలో ప్రభుత్వం తీవ్రమైన జాప్యం చేస్తుందని ఆమె విమ‌ర్శించారు. కాపు ఉద్య‌మ నేత ‘ముద్రగడ ప‌ద్మ‌నాభం ‘ చేస్తోన్న ఉద్యమానికి తామంతా సంఘీభావంగా ఉంటామ‌ని ఆమె చెప్పుకొచ్చారు. కాగా ఈ సమావేశంలో చిత్రరంగానికి సంబంధించిన వారు కూడా హాజరయ్యారు. అనంత‌రం ఖాళీ కంచాలను మోగిస్తూ వారు తమ నిరసనను కూడా వ్యక్తం చేశారు.

Leave a Reply

*