ఆ డైరెక్ట‌ర్‌తో మ‌రో మూవీకి ఎన్టీఆర్‌ చ‌ర్చ‌లు ?

Jr NTR Once Again With That Director, Jr NTR, NTR, Trivikram,

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ఆలోచ‌న‌లు చాలా డిఫ‌రెంట్‌గా ఉంటాయి. జ‌న‌తాగ్యారేజ్ మూవీ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన త‌రువాత ఓ డిఫ‌రెంట్ క‌థ కోసం వెతుకులాట ప్రారంభించాడు. మ‌రో సినిమా అంగీక‌రించ‌డానికి తారక్ చాలా స‌మ‌యం తీసుకున్నాడు. చాలా మంది ద‌ర్శ‌కుల క‌థ‌ల‌ను విన్నాడు. చివరకు ‘పవర్‌’ డైరెక్టర్‌ బాబితో సినిమా చేయ‌డానికి డిసైడ్ అయ్యాడు. ఈ మూవీలో త్రిపాత్రాభినయం అనే కొత్త కోణాన్ని చూపిస్తున్నారు. ఈ మూవీని ఎన్టీయార్‌ అన్నయ్య నందమూరి కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తుస్తున్న సంగ‌తి తెలిసిందే.. బ‌హుశా వైవిధ్యభ‌రిత‌మైన సినిమా కోసం చాలా గ్యాప్ తీసుకుని మ‌రి ఈ సినిమాని అంగీక‌రించిన‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం శ్రీ‌దేవిని సంప్ర‌దించిన‌ట్టు కూడా వార్త‌లు వ‌చ్చాయి.

అనేక కోణాల్లో ఆలోచించి ఓ నిర్ణ‌యానికి వ‌చ్చాడ‌ని భావించి అభిమానులు చాలా హ్యాపీ ఫీల‌య్యారు. ఇక ఈ సినిమా త‌రువాత ఎప్ప‌టి నుంచో ఎదురుచూస్తున్న కాంబినేష‌న్ ఓకే అయింది. అదే మాటల మాంత్రికుడు ద‌ర్శ‌కుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తార‌క్ ఓ సినిమా చేయబోతున్నట్టు ఇటీవలే అధికారిక ప్రకటన కూడా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే..ఇక ఈ సినిమా గురించి కూడా అభిమానుల్లో మంచి హుషారునిచ్చింది. అయితే తార‌క్ మ‌రో నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తాజా స‌మాచారం తెలుస్తోంది. కేవలం ఈ రెండే కాకుండా మరో సినిమా గురించి కూడా ఎన్టీయార్‌ ఇప్పుడే ఓ ఆలోచనకు వచ్చాడని స‌మాచారం.

ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న త్రిక్రమ్‌ సినిమా తర్వాత ‘మనం’ సినిమా డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌తో చేయాలని ఓ సినిమా చేయాల‌ని ఫిక్స్‌ అయ్యాడని టాక్‌. విక్ర‌మ్ దర్శకత్వం వహించిన ‘24’ సినిమా చూసి తార‌క్‌ ఫ్లాటైపోయాడట. ఆయనతో చర్చలు జరుపుతున్నాడట. విక్రమ్‌ కూడా ఎన్టీయార్‌తో చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉండ‌డంతో వెంట‌నే చ‌ర్చేచ‌లు ఫ‌లించాయ‌ని తెలుస్తుంది. ప్రస్తుతం అఖిల్‌తో చేస్తున్న విక్రమ్‌ ఎన్టీయార్‌ సినిమాకు కూడా కథను సిద్ధం చేసే పనిలో నిమ‌గ్న‌మ‌య్యాడ‌ని తెలుస్తోంది. ఇక 2017లో తార‌క్ ఫుల్ బిజీ బిజీగా వ‌రుస‌గా మూడు సినిమాల‌తో గ‌డుపుతున్నాడు. సో.. అభిమానులు హ్యాపీ.. హ్యాపీ.. హ్యాపీ..

Leave a Reply

*