నీలిచిత్రంలో ప్ర‌భాస్ హీరోయిన్‌..!

Kangana Ranaut, Actress Kangana Ranaut, Kangana Ranaut Movies, Prabhas, Prabhas with Kangana Ranaut

సినీ హీరోయిన్లు అంటే ఒక‌ప్పుడు ఎట్టి ప‌రిస్థితిల్లోనూ సెక్సీగా క‌నిపించే వారు కాదు. కానీ మారుతున్న రోజుల ప్ర‌భావ‌మో లేక‌.. ల‌గ్జ‌రీ జీవితానికి అల‌వాటు ప‌డి ఎక్కువ సంపాద‌న ద‌క్కించుకోవ‌డం కోస‌మో.. స్టార్ హీరోల సినిమాల‌లో కూడా ప్ర‌ముఖ హీరోయిన్ల చేత ఐటెం సాంగ్ చేయించ‌డం వ‌ల్ల‌నో తెలియ‌దు కానీ.. మొత్తం మీద హీరోయిన్లు త‌మ శ‌రీర షో ప్ర‌ద‌ర్శ‌న‌ను కొంచెం మోతాదు పెంచారు. ప్రస్తుతం సంచ‌ల‌నాల కోసం ఎంత‌టిక‌యినా తెగిస్తున్నారు కొంద‌రు హీరోయిన్‌లు. హాట్ హాట్ ఫోటోలు, కిక్ ఎక్కించే వీడియోల‌తో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నారు.

ఇక యూత్ వాటిని చూసి పండ‌గ చేసుకుంటున్నారు. ఈ విధంగా కావాల‌నే కొంత‌మంది సెన్షేష‌న్ కోసం ఏం చెయ్య‌డానికైనా సిద్ధం అంటున్నారు. మ‌రికొంద‌రు ఏం చేయ‌క‌పోయినా కాంట్ర‌వ‌ర్సీకి కేరాఫ్ అడ్ర‌స్‌గా మిగులుతున్నారు. ఈ జాబితాలో ముందు వ‌రుస‌లో ఉండే భామ‌ల‌లో బాలీవుడ్ క‌థానాయిక కంగ‌నా రనౌత్ టాప్ ప్లేస్‌లో నిలుస్తుంది. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం క‌లిగిస్తున్నారు. ఆమె వెండితెర‌కు వ‌చ్చిన కొత్త‌ల్లో బ్లూ ఫిలిమ్స్‌లో న‌టించేందుకు సైతం సిద్ధం అయిన‌ట్లు తెలిపింది. ‘నాకు 2006లో నా అరంగేట్ర సినిమా ‘గ్యాంగ్‌స్టర్‌’ కంటే ముందు ఓ ద‌శ‌లో బ్లూఫిల్మ్‌లో న‌టించేందుకు ఆఫర్ వ‌చ్చింద‌ని తెలిపింది. ఆ సినిమా ఫోటో షూట్‌కు కూడా వెళ్లాన‌ని, దుస్తులేమీ లేకుండా కాస్ట్యూమ్ ఇచ్చారు. అప్పుడే అర్థమైంది అది ఓ నీలిచిత్రమని తెలిసింది. అయినా ఫర్వాలేదు.. చేద్దామనుకున్నా.

అయితే అదృష్టవశాత్తూ ‘గ్యాంగ్‌స్టర్‌’లో అవకాశం రావడంతో బ్లూ ఫిల్మ్‌ నుంచి బ‌య‌ట‌ప‌డ్డాన‌ని ఆ విషయాన్ని ఓ కార్యక్రమంలో కంగన వెల్లడించింది. ‘గ్యాంగ్‌స్టర్‌’ కథ నచ్చడంతో అదే చేశాను. కానీ, ఆ బ్లూ ఫిల్మ్‌ నిర్మాత నా మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఆ సినిమా చేయకపోవడంతో చాలా కష్టాలు ఎదుర్కొన్నాను. అప్పుడు నా వయసు 17 ఏళ్లు. ‘గ్యాంగ్‌స్టర్‌’ ఆఫర్‌ కనుక రాకపోయి ఉంటే కచ్చితంగా ఆ సినిమా చేసి ఉండేదాన్ని తెలిపింది. అప్పట్లో నేను ఉన్న పరిస్థితులే ఆ నీలి చిత్రానికి సిద్ధపడేలా చేశాయ’ని కంగన చాలా ధైర్యంగా చెప్పింది.

Leave a Reply

*