ఖైదీ 150లో హైలైట్‌లు, మైనస్‌లు ఏంటో తెలుసా ?

Khaidi No 150 Highlights, Khaidi No 150, Khaidi No 150 Movie, Chiranjeevi, kajal

మెగాస్టార్ చిరంజీవి దాదాపు ప‌దేళ్ల అనంత‌రం ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి సిద్ధ‌మ‌యిపోయింది. ఈ నెల 7న విజ‌య‌వాడ గుంటూరు మ‌ధ్య‌లో ఉన్న హాయ్‌లాండ్‌లో ఈ సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్ అట్ట‌హాసంగా చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఈ విష‌యాన్ని సోష‌ల్‌మీడియా ద్వారా ఖైదీ నిర్మాత రామ్‌చ‌ర‌ణ్ బాస్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులంద‌రూ రావాలంటూ స్వయంగా ప్రకటించేశాడు. ఇంత‌ర‌కు ఈ సినిమా గురించి అన్ని విష‌యాలు బాగానే ఉన్న‌ప్ప‌టికీ ఈ సినిమా అవుట్‌పుట్‌కు సంబంధించి పలు ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలో ఎక్కడా కూడా చిన్న కత్తెర పడొద్దని సినిమా హీరో చిరంజీవి ఇప్పటికే ఇటు ద‌ర్శ‌కుడు వినాయక్‌కు, అటు సినిమాను నిర్మిస్తున్న రామ్‌చరణ్‌కు స్ప‌ష్టమైన ఆదేశాలు ఇచ్చార‌ట‌. రెండున్నర గంటల నిడివి ఉన్న సినిమాకు నిమిషం కూడా కట్ పడొద్దని చెబుతున్నాడట.

సినిమా అవుట్ పుట్ చాలా బాగా వ‌చ్చింద‌ని ఎక్కడా కూడా కత్తిరించాల్సిన పని లేదని కరాఖండిగా చెప్పాడని తెలుస్తోంది. అయితే.. చరణ్ మాత్రం క్లైమాక్స్‌పై కొంత అసహనంగానే ఉన్నాడని టాక్‌. ఎందుకంటే తమిళ కత్తితో పోలిస్తే ఖైదీలో క్లైమాక్స్ కొంత నీరసంగా, డ‌ల్‌గా కొన‌సాగిందని చెర్రీ ఆలోచ‌న‌లో ప‌డ్డ‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే.. ఫ్యాన్స్‌కు నచ్చేలా మాత్రం వినాయక్ సినిమా తీశాడంటూ ఫిల్మ్‌నగర్‌లో ప‌లువురు చెప్పుకొంటున్నారు. ఈ సినిమాలో ఇంటర్వెల్ కంటే ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయంటున్నారు. కత్తితో పోలిస్తే ఖైదీ ఇంటర్వెల్ సీక్వెన్స్ చాలా సూపర్‌గా వచ్చాయని సినీ జనాలు చెప్పుకొంటున్నారు. చిరంజీవి ఇంట్రడక్షన్ సీన్, 3 పాటలు, ఇంటర్వెల్ సీన్ సూపర్‌గా అదిరిపోయాయ‌ట‌.

ఇక ఈ సినిమాలో పోసాని కృష్ణ మురళీ పేల్చిన పంచ్ డైలాగులు కూడా సినిమాకు మంచి ప్ల‌స్ అవుతాయ‌ని అంటున్నారు. ఇక ఈ సినిమాలో మెరుపులు మెరిపించ‌డానికి విచ్చేస్తున్న‌ బ్రహ్మానందం పాత్రను మాత్రం మరోసారి డీలా చేసేశారని టాక్‌. బ్రహ్మీకి సినిమాలో తగిన ప్రాధాన్యమేమీ లేదని అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఏది ఎలా ఉన్న‌ప్ప‌టికీ ఈ సినిమాను చిరు తనకున్న చరిష్మాతోనే నడిపించేశారని, డాన్సుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదని ఫిల్మ్‌నగర్ వర్గాల టాక్. సో.. ఈ సినిమా అవుట్‌పుట్ ఎలా ఉంద‌నేది ప్రేక్షకులే తేల్చి చెప్పాలి. అంటే ఈనెల 11వ తేదీ వ‌ర‌కు వెయిట్ చేయాలి.

Leave a Reply

*