7న గుంటూరులో ఖైదీ ప్రీ రిలీజ్ వేడుక‌

KhaidiNo150 pre-release function, KhaidiNo150 Movie, Chiranjeevi, Kajal, Ram Charan

మెగాస్టార్ చిరంజీవి కం బ్యాక్ మూవీ ‘ఖైదీ నంబర్ 150’ ప్రి రిలీజ్ వేడుక ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్ల‌కు సిద్ధ‌మైన టీం బృందానికి ఎదురుదెబ్బ త‌గిలింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ విష‌యంపై సస్పెన్స్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ముందుగా ఈ సినిమా వేడుక 4న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తామని నిర్మాత రామ్ చరణ్ స్వయంగా ప్ర‌క‌టించారు. బాస్ ఈజ్ క‌మింగ్ అంటూ ప్ర‌చారం నిర్వ‌హించారు. అయితే సినిమా వేడుక‌ను విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించ‌డానికి ప్ర‌భుత్వ అనుమతులు రాకపోవడంతో అది సాధ్యం కాలేదు.

క విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ విజయవాడ స్టేడియంలో ఈవెంట్ జరిపే అవకాశం లేదని తేలిపోవడంతో ప్రత్యామ్నాయాలపై ఖైదీ యూనిట్ దృష్టి పెట్టింది. ఎట్ట‌కేల‌కు ఈ కార్యక్రమాన్ని గుంటూరుకు తరలించింది. ఫైన‌ల్‌గా ఈ నెల 7వ తేదీన విజయవాడ-గుంటూరు మధ్యలో ఉన్న హాయ్ ల్యాండ్ లో ఖైదీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌ర‌ప‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 7వ తేదీన గ్రాండ్ గా జరుపుతున్నట్లు అధికారికంగా ప్ర‌క‌ట‌న చేశారు. బాస్ ఈజ్ బ్యాక్ ఈవెంట్ అంటూ జరిగే ఈ కార్యక్రమానికి అభిమానులు భారీ ఎత్తున హాజరయ్యే అవకాశాలున్నాయి. అయితే ఖైదీ నంబర్ 150 మూవీ రిలీజ్ కేవలం 4 రోజుల ముందుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రుపుకోవ‌డం విశేషం.

మూవీపై ఇప్పటికే విపరీతమైన బజ్ ఉంది. అడుగడుగునా సినిమా స్టిల్స్‌ను బ‌య‌ట పెడుతూ వార్త‌ల్లో నిల‌బ‌డేలా ప్లాన్ చేశారు. దీనికితోడు పాటల విడుద‌ల కూడా ఒక్కొక్క పాటను విడుద‌ల చేయ‌డంతో సినిమాపై పెరిగింది. దీంతో అభిమానుల సంబరాలు అప్పుడే ఆకాశాన్ని అంటే స్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడు 7వ తేదీన ప్రీ రిలీజ్ వేడుక‌ నుంచి కేవలం 4 రోజుల్లో అంటే జనవరి 11న సినిమా విడుద‌ల అవుతుండ‌డంతో అభిమానుల ఆనందం పీక్ స్టేజ్ కి చేరిపోతోంది. ఇక సినిమా విడుద‌ల‌య్యాక అభిమానుల కోలాహ‌లం ఓ రేంజ్‌లో ఉంటుంది. దాదాపు ప‌దేళ్ల అనంత‌రం చిరు సినిమా రాక‌పై అంద‌రూ స‌ర్వ‌త్రా ఆస‌క్తిగా చూస్తున్నారు.

Leave a Reply

*