ఆ 5 కోట్ల క్రెడిట్ ఫోర్న్‌స్టార్‌ సన్నీదా…? షారుఖ్‌దా..?

Laila Main Laila, Raees Movie, Shah Rukh Khan, Sunny Leone, Pawni Pandey, Ram Sampath

బాలీవుడ్ హీరోల్లో 2017వ సంవ‌త్స‌రంపై అధికంగా ఆశ‌లు పెట్టుకుని ఎదురుచూస్తున్న హీరో ఎవ‌రూ అంటే అంద‌రికి వెంట‌నే గుర్తుకు వ‌చ్చే హీరో బాద్‌షా కింగ్‌ఖాన్ షారుఖ్‌ఖాన్‌. కొన్నేళ్లుగా త‌న స్థాయికి త‌గ్గ హిట్ కొట్ట‌డంలో ఫెయిల్ అవుతున్నాడ‌ని సినీవ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో షారుఖ్ ఖాన్ ఎట్టిప‌రిస్థితిల్లోనూ హిట్ కొట్టి తీరాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉన్నాడు. ఈ దిశ‌గానే బాలీవుడ్ బాద్‌షా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా ‘రాయిస్’ తో హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. షారుఖ్ రేంజ్ ఏమిటో చూపించాల‌ని ఉవ్విళ్లూరుతున్నాడు. ‘రాయిస్‌’ సినిమాతో ఆ విష‌యం తేలిపోతుందని, ఈ సినిమా ఫలితాల విషయంలో తేడా వస్తే కింగ్ ఖాన్ ఇమేజ్ మరింత డామేజ్ ప‌డి కుంగిపోవ‌డం ఖాయం అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక సినిమా విష‌యం ఇలా.. ఈ మూవీలో ‘లైలా ఓ లైలా’ సాంగ్‌కు య్యూటూబ్‌లో 5 కోట్ల వ్యూస్ రావడంతో ఇండ్రస్టీలో రకరకాల ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. ‘రాయిస్’పై క్రేజ్ వల్లే ఈ పాటపై మూవీ లవర్స్ ఆసక్తి చూపిస్తున్నారని కొందరు వాదిస్తున్నారు.. మ‌రికొంత‌మంది ‘లైలా ఓ లైలా’ పాట అంతగా పాపులర్ కావడానికి ప్రధానమైన కారణం సన్నీలియోన్ అని మరికొందరు వాదిస్తున్నారు. సినిమా మంచి సూప‌ర్ హిట్ కావ‌చ్చు.. అందులోని పాట‌కు 5 కోట్ల వ్యూస్ రావ‌డం అంటే పాట‌న‌చ్చి, ఆ పాట‌లో న‌టించిన స‌న్నీదే అని కొంద‌రు అంటున్నారు. ఆ పాట‌లో సన్నీలియోన్ మ‌త్తెక్కించే స్టెప్పుల‌తో కుర్ర‌కారును ఉర్రూత‌లూగించ‌డంతో పాటు ఒకప్పటి హిట్ సాంగ్‌కు రిమేక్ కావడమే వల్లే నెటిజన్లు ఈ పాటకు అంతాగా ఆసక్తి చూపించారన్నది మ‌రికొంత‌మంది అభిప్రాయం.

ఏదిఏమైనా మొత్తం మీద ‘రాయిస్‌’లోని సన్నీలియోన్ ఐటెం సాంగ్ తరహాలోనే సినిమా కూడా సక్సెస్ సాధిస్తే షారుఖ్ కష్టాలన్నీ తీరిపోయిన‌ట్టువుతుంద‌ని అని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో సన్నీ సాంగ్‌కి వ‌చ్చిన‌ వ్యూస్‌కు కారణం సన్నీనా లేక షారుఖ్ ఇమేజ్‌ అనేది తెలియాలంటే ‘రాయిస్’ రిలీజ్ అయ్యేంతవరకు అంటే ఈనెల 25 వ‌ర‌కు వేచి ఉండాలి. అప్ప‌టి వ‌ర‌కు లైలా ఓ లైలా సాంగ్ మీరు కూడా ఓ సారి చూసి త‌రించండి.

Leave a Reply

*