‘మహేష్ ఈజ్ బ్యాక్’.. ఎప్పుడో తెలుసా !

Mahesh Babu, Mahesh23, Rakul Preet,

ప్రిన్స్ మ‌హేష్ ఈజ్ బ్యాక్ అంటే ఇదేదో సినిమా అనుకుంటున్నారా.. ? ప్ర‌స్తుతం చిరంజీవి న‌టిస్తున్న ఖైదీ సినిమాలో బాస్ ఈజ్ బ్యాక్ అనే ప‌థం నానుడి అయింది.. అందుకే ‘మహేష్ ఈజ్ బ్యాక్స‌.. అంటున్నాం.. అయితే మీరు ఊహించినటువంటి సినిమా టైటిల్ మాత్రం కాదు. అస‌లు విష‌యంలోకి వెళితే.. మహేష్ బాబు ప్రస్తుతం యూరోప్ టూర్ లో ఉన్నారు. ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్ లో ఎంజాయ్ మహేష్‌… ఎంజాయ్‌చే స్తున్నాడు . క్రిస్మస్ పండుగ ముందు నుంచి న్యూ ఇయర్ పూర్తయ్యే వరకూ లాంగ్‌టూర్ వేసి ఎంజాయ్ చేస్తున్న‌ మహేష్ బాబు.. మళ్లీ తన మూవీ పనులు ప్రారంభించేందుకు సిద్ధమైపోయాడు.

త‌మిళ ద‌ర్శ‌కుడు మురుగదాస్ తో తెరకెక్కుతున్న సినిమా కోసం అహ్మదాబాద్ లో దాదాపు నాలుగు వారాలపాటు షూటింగ్ అవిశ్రాంతంగా మహేష్ షూటింగ్‌లో పాల్గొని ఫ్యామిలీ టూర్ కోసం బ్రేక్ ఇచ్చాడు. ఇప్పుడు మళ్లీ జనవరి 7 నుంచి మురుగదాస్ తీసే సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతున్నాడు. ఈ మూవీ షూటింగ్ కోసం ప్రస్తుతం హైద్రాబాద్ లో భారీ సెట్ నిర్మాణం జ‌రుగుతోంది. కొత్త సెట్ లో మెజారిటీ భాగం సినిమా ఈ సెట్ లోనే షూటింగ్ జరగనుందని స‌మాచారం. వీలైనంత త్వరగా మురుగదాస్ తో చేస్తున్న ఈ చిత్రాన్ని పూర్తి చేయాలన్నది మహేష్ టార్గెట్.

అయితే ఈ సినిమాకి ‘సంభవామి’ అనే టైటిల్ ఈ చిత్రానికి అనుకుంటున్న‌ప్ప‌టికీ ఇంకా ఫైనల్ కాలేదన్న సంగతి తెలిసిందే. అందుకే న్యూ ఇయర్ కి టీజర్ విడుద‌ల చేయలేదని సిని జనాలు అనుకుంటున్నారు. ‘మురుగదాస్ డైరెక్షన్ కావడంతో తమిళ్ రైట్స్ కోసం విపరీతమైన డిమాండ్ నెలకొందని టాక్‌. తమిళ్ లో కూడా భారీ ఎత్తున విడుద‌ల‌ చేసేందుకు ప్ర‌ణాళిక‌లు చేసుకుంటున్నామని ‘ చెబుతున్నారు నిర్మాతలు. ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో దర్శకుడు ఎస్ జే సూర్య విలన్ గాను.. మరో తమిళ హీరో భరత్ కూడా నెగిటివ్ రోల్ లోను అల‌రించ‌నున్నార‌ని తెలుస్తోంది.

Leave a Reply

*