విడాకుల‌కు సిద్ధం అవుతోన్న ఫైర్ బ్యూటీ

Nandita Das shocks with news of divorce from Subodh Maskara, Nandita Das , Subodh Maskara, Nandita Das with Subodh Maskara

దేశ‌వ్యాప్తంగా ఫైర్ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసిన‌ నందితా దాస్ గుర్తుందా.. ? అదేనండి 20 ఏళ్ల కింద‌ట 1996లో ఫైర్ సినిమా విడుద‌లై కుర్ర‌కారులో ఎన్నో నిద్ర‌లేని రాత్రులు గ‌డిపేలా చేసింది. ఆ సినిమాలో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకోవ‌డంతో ఫైర్ బ్యూటీగా పేరొచ్చింది. అంతటి విశేష ఆద‌ర‌ణ పొందిన సినిమా కావ‌డం వ‌ల్లే నందితా ఇప్ప‌టికీ చాలా మందికి గుర్తుండిపోయింది. అయితే ఇప్పుడు ఆమె నిజ‌జీవితంలో ఓ బాధాకరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తోంది. 2016లో బాలీవుడ్ లో పీక్ స్టేజ్ కి చేరుకున్న విడాకుల సీజన్.. ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. నందితా దాస్ కూడా తన భ‌ర్త‌ సుబోధ్ మస్కరకు విడాకులు ఇస్తోందనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. నందిత‌దాస్ త‌న‌ ఏడేళ్ల కాపురానికి అంతం పలకబోతున్నారని వచ్చిన వార్తలను ఆమె కూడా ధృవీకరించింది. ‘మేం విడాకులు తీసుకోబోతోన్న మాట వాస్తవమేన‌ని పేర్కొంది

నేను నా భ‌ర్త సుబోధ్ ఇప్పటికే నిర్ణయించుకున్నాం. అయితే.. ఇది సౌమ్యంగా పూర్తి చేయాలని భావిస్తున్నాం. మా ఆరేళ్ల అబ్బాయే అన్నిటికంటే మాకు ప్రధానం అని అంది. త‌ల్లిదండ్రులుగా అతని విషయంలో ఎటువంటి లోటు ఉండకూడదని నిర్ణ‌యించుకుంటున్నాం’ అంటూ విడాకుల సంగతి ఖాయం చేసిన నందితా దాస్.. కుమారుడి విషయంలోనే ఎక్కువగా బాధపడాల్సి వస్తోందని స్ప‌ష్టం చేస్తోంది. మేమిద్ద‌రం విడిపోయిన తర్వాత ముంబైలో కంటే తాను ఎక్కువ కాలం నివసించిన ఢిల్లీలోనే ఉండబోతున్నట్టు ఆమె చెప్పింది. ప్రస్తుతం తను డైరెక్ట్ చేస్తున్న మాంటో మూవీ పూర్తయ్యేవరకూ ముంబైలోనే ఉంటానని స్ప‌ష్టం చేసింది.

Leave a Reply

*