అంతా తూచ్.. ఖైదీ ఫంక్షన్ కి పవన్ క‌న్ఫ‌మ్..!!

Pawan Kalyan For Khaidi No 150 Pre-Release Event, Pawan Kalyan, Khaidi No 150 Pre-Release Event, Khaidi No 150 Movie, Khaidi No 150, Chiranjeevi, Kajal

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం.150’ ని చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న‌ట్టే క‌నిపిస్తుంది. చాలా అట్ట‌హాసంతో ఎక్క‌డా కూడా త‌గ్గ‌కుండా ప్రేక్ష‌కుల‌ను, సినీ అభిమానుల‌ను ఆక‌ర్షించేందుకు ఎన్ని చేయాలో అన్నీచేసేస్తున్నారు. నిర్మాత రామ్‌చ‌ర‌ణ్ కూడా సినిమాను చాలా తెలివిగా మంచి హైప్‌ను తీసుకురావ‌డంలో స‌క్సెస్ అయ్యార‌నే చెప్పాలి. ఇటీవ‌ల రామ్‌చ‌ర‌ణ్ అభిమానుల‌తో మాట్లాడుతూ ప‌వ‌న్ ప్రీరిలీజ్ ఫంక్ష‌న్‌కు వ‌స్తున్నారా.. ? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇస్తూ.. మేమైతే ఆహ్వానించాం.. రావ‌డం.. రాక‌పోవ‌డం ఆయ‌న ఇష్టం అంటూ చెప్ప‌డంతో ఈ విష‌యం సోష‌ల్‌మీడియాలో రాద్దాంతం అయింది. దీంతో ఈ సినీ వేడుక‌కు ప‌వ‌న్ రావ‌డం లేద‌ని అనేది అంద‌రికీ అర్ధ‌మ‌యిపోయింది.

ప‌వ‌న్ ప‌ట్ల అలా మాట్లాడ‌డం మెగా అభిమానుల్లో కొంతమందికి న‌చ్చ‌లేదు.. సంక్రాంతి కానుకగా ఖైదీ ఈ నెల11న ప్రేక్షకుల ముందుకు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.. ఈలోపు ఈ నెల 7న‌ విజయవాడ – గుంటూరు మధ్యలో ‘హాయ్ ల్యాండ్’ ఎమ్యూజ్ మెంట్ పార్క్ లో మెగా ఖైదీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ అదిరిపోయే రేంజ్ లో చేయ‌డానికి ఏర్పాట్లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.. మెగాస్టార్ దాదాపు ప‌దేళ్ల అనంత‌రం రీ-ఎంట్రీ ఇస్తోన్న తర్వాత చేస్తోన్న బిగ్ ఫంక్షన్ కి దర్శక రత్న దాసరి నారాయణ రావుని ముఖ్య అథితిగానూ, మ‌రో ముఖ్య అతిథిగా ద‌ర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వస్తున్నట్లు ఇటీవ‌లే తెలిపారు.. అయితే పవన్‌క‌ళ్యాణ్ రావ‌డం లేదని అల్లు అరవింద్ క్లారిటీ ఇవ్వగా పవన్ అభిమానులు నిరాశపడ్డారు. రామ్‌చ‌ర‌ణ్ కూడా అలా మాట్లాడ‌డంతో ఫ్యాన్స్ డిసైడ్ అయిపోయారు.

ఇటీవ‌ల అల్లు అరవింద్ చేసిన ప్రకటన నిజమే అయినా పవన్ ఈ ఫంక్షన్ కి రావడం ఖాయం అంటున్నారు.. “రావ‌డం లేట‌వ్వ‌చ్చేమో కానీ.. రావ‌డం మాత్రం ప‌క్కా” అనే రేంజ్లో ఈ ఫంక్ష‌న్‌కు ప‌వ‌న్ వ‌స్తున్నార‌ట‌. ఇంతకీ విషయం ఎలా ఫిక్స్ అయిందంటే.. మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ అంటే పవన్ కి చాలా అభిమానం. పలుమార్లు వేదికలపై వదిన సరేఖ నాకు తల్లిలాంటిదని చెప్పుకున్న సంగ‌తులు కూడా ఉన్నాయి. అలాంటి వదిన స్వయంగా వచ్చి మెగా ఫంక్షన్ ని ఆహ్వానిస్తే.. పవన్ రాకుండా ఎలా ఉంటారు ? ఇప్పుడు ఇక్క‌డ జరిగింది. మెగాస్టార్ చిరంజీవి – సురేఖ దంపతులు స్వయంగా వెళ్లి ఫంక్షన్ కి రావాల‌ని ఆహ్వానించారాట. దీంతో.. తప్పకుండా వస్తానని వదినకి మాటిచ్చాడని తెలుస్తోంది. సో.. అభిమానుల‌కు ఇక పండుగే పండ‌గ‌. హ్యాయ్‌లాండ్ అదిరిపోవ‌ల‌సిందే అంటున్నారు మెగా ఫ్యాన్స్.

Leave a Reply

*