2,3 నెల్ల‌లో ప్ర‌భాస్ 20 కిలోలు త‌గ్గుతాడా ?

Prabhas To Down 20 Kilos in 2 3 Months, Prabhas, Actor Prabhas, Bahubali, Bahubali2,

జ‌క్క‌న్న రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న బాహుబలి ది కంక్లూజన్ షూటింగ్ 2016 డిసెంబర్ చివరకే పూర్తి కావాల్సి ఉంది.. అయితే పూర్తిస్థాయి పర్ఫెక్షన్ కం ప్యాచ్ వర్క్స్ కోసం ఇంకా షూటింగ్ కంటిన్యూ అవుతోంది. అయ‌తే ఎట్ట‌కేల‌కు సంక్రాంతి నాటికి ఈ మూవీని పూర్తి చేసేసేందుకు రాజమౌళి ఫిక్స్ అయ్యాడు. సో.. ఇక అక్కడి నుంచి కొత్త సినిమా ప్రాజెక్టుల‌పై పని చేసేందుకు యంగ్ రెబల్ స్టార్ కు స్వేచ్ఛ ల‌భిస్తుంది. అయితే ఇప్ప‌టికే సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ కొత్త మూవీ ఉంటుందనే సంగతి అంద‌రికీ తెలిసిన పాత విష‌య‌మే.. ఈ మూవీ కోసం చాలా కాలం నుంచి ద‌ర్శ‌క నిర్మాత‌లు ఎదురు చూస్తున్నారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా అస‌లు స‌మ‌స్య‌లు ఇక్క‌డే వ‌చ్చింద‌ట‌. ఈ సినిమా కోసం ప్రభాస్ ఇప్పుడు చాలానే బరువు తగ్గాల్సి ఉంద‌ట‌. బాహుబలి పాత్ర కోసం భారీగా బరువు పెరిగిన ఈ యంగ్ హీరో.. త‌న నెక్స్ట్ కొత్త‌ సినిమాలో అథ్లెటిక్ బాడీతో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఈవిధంగా కనిపించాలంటే కనీసం ఇప్పుడున్న బరువు నుంచి 20కిలోలు త‌ప్ప‌నిస‌రిగా త‌గ్గాల్సి ఉంటుందని సూచిస్తున్నార‌ట‌. ప్రభాస్ ప్రస్తుతం ఆ ఏర్పాట్లలోనే నిమ‌గ్న‌మ‌వుతున్నాడ‌ట‌.

కేవలం బ‌రువు కారణంతోనే కొత్త సినిమా ప్రారంభం ముహూర్తాన్ని మార్చికి మార్చారని అంటున్నారు. కానీ ఫ‌ర్‌ఫెక్ష‌న్ బాడీ ఉన్న వ్య‌క్తి 20 కిలోలు తగ్గడం అంటే చిన్న విషయం కాదు. ప్ర‌ఖ్యాత బాలావుడ్ న‌టుడు దంగ‌ల్ చిత్రం కోసం 10 కిలోల బరువు తగ్గించుకునేందుకు అమీర్‌ ఖాన్ కు 6 నెలల సమయం పట్టింది. అయితే శ్ర‌మ‌కు త‌గ్గ ఫ‌లితం కూడా అదే రేంజ్లో అమీర్‌కు ద‌క్కింది. 13రోజుల్లోనే రూ. 300 కోట్ల క్ల‌బ్‌లో చేరి రికార్డుల సునామీ సృష్టిస్తూ.. దూసుకుపోతున్నాడు. కానీ ప్రభాస్ మాత్రం 20 కేజీలను 2-3 నెలల్లోనే తగ్గించుకోవాలని భావిస్తున్నాడ‌ట‌. ఇది అంత తేలికైన విషయం కాద‌ని అంద‌రికీ తెలుసు. మ‌రి కుర్ర హీరో కాబ‌ట్టి ఈ ఫిట్‌నెస్ కాపాడుకుంటూ ఏ రేంజ్‌లో ప్ర‌య‌త్నిస్తే ఎంత త్వ‌ర‌గా త‌గ్గుతాడో కూడా అంద‌రికీ ఓ ప్ర‌శ్న‌గానే మిగిలిపోతోంది. త‌గ్గితే ఇది కూడా ఓ రికార్డ్‌గానే ప‌రిణ‌మిస్తుంది. ఏది ఏమైనా.. ఈ టార్గెట్ రీచ్ అయ్యాకే మూవీ అంటే మాత్రం.. ప్రభాస్ కొత్త సినిమా మరింత ఆలస్యం కావచ్చని సినీ పండితులు భావిస్తున్నారు.

Leave a Reply

*