వావ్ : మ‌హాన‌టి సావిత్రిపై బుక్ రాసిన స‌మంత !

Samantha Written Book on Savitri, Samantha, Savitri

అల‌నాటి మహానటి సావిత్రిపై సినిమా రూపొందించేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. ఈ హెడ్డింగ్‌ను చూసి సావిత్రి క‌థ‌ను ఈ కాలంలో పెరిగిన స‌మంత బుక్ రాయ‌డం ఏమిటా అనుకుంటున్నారా.. ? మీకు వ‌చ్చిన సందేహం నిజ‌మే.. నిజంగానే సావిత్రి జీవిత క‌థ‌పై బుక్ రాయ‌డం లేదండి.. ఈ విష‌యం అర్ధం కావాలంటే ఇది చ‌దివి తీరాల్సిందే.. ఈ సినిమాలో సావిత్రి పాత్ర కోసం ముందుగా అక్కినేని కోడ‌లు అవ‌బోతున్న ముసి ముసి న‌వ్వుల స‌మంత‌ను అంద‌రూ అనుకున్నారు. అయితే ఈ సినిమా పాత్ర కోసం కొంచెం బొద్దుగా ఉండాల‌ని, దీనికి కోసం బ‌రువు పెరగాల‌ని ద‌ర్శ‌క, నిర్మాత‌లు సూచించ‌డంతో సావిత్రి పాత్ర‌కు నో చెప్పింది స‌మంత‌.

ఈ స్క్రిప్ట్ పై చాలాకాలం పని చేసిన దర్శకుడు నాగ్ అశ్విన్.. ఇప్పుడు సినిమాను తెరకెక్కించేందుకు మ‌రింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నాడు. ఎట్ట‌కేల‌కు మహానటిగా లీడ్ రోల్ ను కీర్తి సురేష్ చేయబోతోందనే ప్రచారం ప్ర‌స్తుతం జోరుగా సాగుతోంది. అయితే.. ఈ మూవీలో సమంత కూడా కీలక పాత్ర చేయబోతోందట. సావిత్రి ఆటోబయోగ్రఫీ రాసే జర్నలిస్ట్ పాత్రలో సమంత న‌టిస్తుంద‌ని టాక్‌. నిజానికి సమంతకు సావిత్రిగా లీడ్ రోల్ లో నటించే అవకాశం వ‌చ్చిన‌ప్ప‌టికీ .. ఆ పాత్ర కోసం బరువు పెరిగి లావుగా మారాల్సిన అవసరం రావ‌డంతో ఛాన్స్ ను వదులుకున్న‌ స‌మంత . ఈ క‌థ‌ గురించి పూర్తిగా అర్ధం చేసుకున్న‌ సమంత.. ఈ ప్రాజెక్టులో భాగం కావాలనే ఆలోచ‌న‌తో తనకు జర్నలిస్ట్ అవకాశం ఇస్తే చేస్తానని మేకర్స్ కు సూచించింద‌ట‌. దీంతో వెంటనే ఈ ఆఫర్ ను ఈ ముద్దుగుమ్మ‌కు ఇచ్చేశారు.

మహానటి మూవీలో సమంత చేయనున్న పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందని అంటున్నారు. ఇటువంటి బయోపిక్ లో భాగం అవుతున్నందుకు సంతోషం వెలిబుచ్చుతోంది సమంత. చాలాకాలంగా తెలుగు సినిమాకు అంగీకారం తెల‌ప‌ని ఈ బ్యూటీ.. మహానటిలో భాగం కావడం విశేషం. ఫిబ్రవరి నుంచి ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళుతుంద‌ని స‌మాచారం. తెలుగు.. తమిళ్.. హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని ద‌ర్శ‌క నిర్మాత‌లు తెరకెక్కించనున్నారని టాక్‌. మొత్తం మీద మ‌హాన‌టి సావిత్రి జీవిత క‌థ‌ను ఈ కాలంనాటి అభిమానులు కూడా చూసి అదృష్టం క‌లుగుతుంద‌న్న‌మాట‌.

Leave a Reply

*