నాకూ… ఆ రొమాన్సే ఇష్ట‌మంటున్న శృతిహాస‌న్‌

Shruti Haasan About Her Life, Actress Shruti Haasan, Shruti Haasan

విలక్షణ నటుడు కమలహాసన్ కుమార్తె శృతిహాస‌న్ త‌న అందచందాల‌తో, త‌న న‌ట‌న‌తో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. ఎక్క‌డా కూడా త‌న తండ్రి పేరు చెప్పుకుని ముందుకు వ‌చ్చిన స‌న్నివేశాలు లేవు. అటువంటి కూడా ఆమెకు ఇష్టం ఉండ‌దు. టాలీవుడ్‌లోకి కొత్త‌లో కొంత రాణించిన‌ప్ప‌టికీ త‌రువాత సినిమాలు త‌గ్గాయి. ఐర‌న్‌లెగ్‌గా కూడా ముద్ర వేయించుకుంది. ఆత‌రువాత ప‌వ‌న్ స‌ర‌స‌న స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమాలో న‌టించి మంచి ఫామ్‌ను దొర‌క‌బుచ్చుకుంది. స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. మంచి ఫామ్‌తో చాలా సినిమాల‌లో అవ‌కాశాలు అందిపుచ్చుకుంది. ఇక దీంతో సినిమాలు… సంగీతం… జీవితం… ఎక్కడ చూసినా శ్రుతీహాసన్‌ మోడ్రన్‌ అమ్మాయిలకు రోల్‌ మోడల్‌ అన్నట్టు కనిపిస్తోంది. ఇటీవ‌ల ఈ ముద్దుగుమ్మ ఓ రొమాన్స్‌పై కామెంట్ చేసి సోష‌ల్‌మీడియాలో నిలిచింది. త‌న తండ్రి క‌మ‌ల్‌హాస‌న్ అప్పుడ‌ప్పుడు త‌మ చిన్ననాటి ప్రేమ విష‌యాలు చెప్పేవారిని తెలియ‌జేస్తూ.. మోడ్రన్‌ డేస్‌ రొమాన్స్‌ కంటే ఓల్డ్‌ స్టైల్ రొమాన్సే ఇష్టమట ! ‘‘మా రోజుల్లో వాట్సాప్, ఇతరత్రా మొబైల్‌ యాప్స్‌ లేవు.

అందువల్ల, అందరూ నేరుగా కలుసుకుని మాట్లాడుకునేవారు. మీటింగులు, మాటల వల్లే సగం ప్రేమకథలు చిగురించేవి’’ అని కమల్‌హాసన్‌ శ్రుతీతో చెప్పేవారట!! .. ఇంకా శ్రుతీహాసన్‌ మాట్లాడుతూ – ‘‘ల్యాండ్‌లైన్‌కి బాయ్‌ఫ్రెండ్‌ ఎవరైనా కాల్‌ చేస్తే ఎక్కడ అమ్మ ఫోన్‌ లిఫ్ట్ చేస్తారో అని కంగారు… నోకియా ఫోనులు, ఇంట్లో తెలియకుండా మెస్సేజ్‌లు పంపుకోవడాలు.. ఎంతైనా ఆ రోజులే వేరు. అని నాన్న చెప్పిన అల‌నాటి ప్రేమకథలు చెప్పిన‌వి నాకింకా గుర్తున్నాయి. ఇప్పటి యువతరమంతా అటువంటి రొమాంటిక్ స‌న్నివేశాల‌ను మిస్‌ కావడం బాధాకరం. నాకు మాత్ర ఓల్డ్‌ స్టైల్ సింపుల్‌ రొమాన్స్‌ అంటేనే ఇష్టం’’ శ్రుతి హాస‌న్ త‌న మ‌న‌సులో మాట చెప్పారు.

Leave a Reply

*