ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీలో శ్రీదేవి ?

Sridevi in NTR Next Movie, Sridevi in NTR Bobby Movie, Sridevi, NTR, Director Bobby

జూనియర్ ఎన్టీఆర్ 2016 సంవ‌త్స‌రాన్ని చాలా మంచి సినిమాల‌తో, రికార్డుస్థాయి క‌లెక్ష‌న్ల‌తో ఘనంగా ముగించి న్యూఇయ‌ర్లోకి ప్ర‌వేశించాడు. 2016లో విడుద‌లైన సినిమాల‌లో నాన్నకు ప్రేమతో.. జనతా గ్యారేజ్ ల రూపంలో భారీ హిట్ల‌ను సొంతం చేసుకున్నాడు. ఇక 2017లో తీయ‌బోయే ప్రాజెక్టు కోసం ఇప్ప‌టి నుంచే అనేక ప్ర‌ణాళిక‌ల‌ను ర‌చిస్తున్నాడు. యంగ్ టైగర్ ఈ దిశ‌గా ముందుగుడు వేస్తున్నాడు. ఓ సినిమా స‌క్సెస్ కావ‌డానికి న‌టీ న‌టుల‌తో పాటు అనేక విష‌యాల‌ను దాగి ఉండ‌డంతో వాట‌న్నింటిని ఈ సినిమాలో కూర్పు చేయ‌డానికి ఎన్టీఆర్ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడ‌ట‌. బాబీ దర్శకత్వంలో రూపొందబోయే ఈ చిత్రానికి పాత్రధారుల ఎంపిక ప్ర‌స్తుతం జ‌రుగుతోంది.

ఎన్టీఆర్-బాబీల కాంబినేషన్ లో రూపొందే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర ఉంటుందట. ఈ సినిమాకి ఎంతో ప్రాధాన్యత‌ను సంత‌రించుకున్న ఆ పాత్రను సీనియర్ నటీమణితో చేయించాలని ఆలోచ‌న‌లో తార‌క్ ఉన్నాడ‌ట‌. ఈ సినిమాలో ఆ ప్రాధాన్యం గ‌ల పాత్ర కోసం శ్రీదేవిని అడుగుతున్నారనే వార్త‌లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే దర్శకుడు బాబీ ముంబై వెళ్లి ఓసారి శ్రీదేవిని కలిశాడని కూడా తెలుస్తోంది. ఆ పాత్ర గురించి.. సినిమాలో ఆ పాత్ర‌కున్న ప్రాధాన్యం గురించి వివరించాడనే టాక్ వినిపిస్తోంది. అయితే శ్రీదేవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా లేదా అనే విషయంపై మాత్రం ఎటువంటి స్పష్టత రాలేదు.

తెలుగు ఇండ‌స్ట్రీలో సీనియ‌ర్ హీరోయిన్ శ్రీ‌దేవి ఎన్నో అద్భుత‌మైన సినిమాల‌ను చేసింది. కొన్ని సినిమాల‌లో శ్రీ‌దేవి న‌ట‌న గురించి ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. మ‌రికొన్ని సినిమాల‌లో హీరోల‌తో పాటు స‌మాన ప్రాధాన్యం గ‌ల సినిమాల‌ను కూడా చేసింద‌న‌డంలో ఎటువంటి సందేహం లేదు. రీ ఎంట్రీ తర్వాత దక్షిణాదిలో ఒకే ఒక సినిమా చేసింది. కోలీవుడ్ హీరో విజయ్ మూవీ పులిలో కీలక పాత్ర చేసినా.. ఆ మూవీ ఆక‌ట్టుకోలేదు. ప్లాప్ అయింది. ఇక తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వడం విషయంలో కూడా శ్రీదేవి ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని స‌మాచారం. అయితే.. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ కోసం నిజంగానే శ్రీదేవిని అప్రోచ్ అయ్యారా..? ఆమె టాలీవుడ్ రీఎంట్రీ ఖాయమైందా లేదా అనే విషయం ఇంకా స్ప‌ష్టత రాలేదు. సో.. ఏది ఏమైన‌ప్ప‌టికీ మ‌రికొన్ని రోజుల్లో ఈ విష‌యంపై స్ప‌ష్ట‌త ఖాయం అంటున్నారు.

Leave a Reply

*