హీరోయిన్‌ నమితకు ఇంటిఓనరు వేధింపులు

troubles from Namitha's home, Namitha, Actress Namitha

ప్ర‌ముఖ త‌మిళ హీరోయిన్, బొద్దుగుమ్మ న‌మిత త‌న అంద‌చందాల‌తో కుర్ర‌కారును ఏడిపించింది. తూచ్‌.. తూచ్‌.. ఏడిపించ‌డం అంటే ఆ ఏడిపించ‌డం కాదులెండి.. త‌న అందాల ఆర‌బోత‌తో.. శృంగార స‌న్నివేశాల‌తో కుర్రాళ్లు నిద్ర‌ప‌ట్ట‌ని రాత్రులు గ‌డిపేవిధంగా ఏడిపించింద‌న్న‌మాట‌. ఈ బొద్దుగుమ్మ ఒక‌ప్పుడు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సొంతం సినిమాలో చాలా రివ‌ట‌లా స‌న్న‌గా నిగారించిపోయే అందంతో మిళ‌మిళ‌లాడేది. ఇప్పుడు ద‌బ్బ‌పండులా అంత‌కంటే ఎక్కువ‌గా నిగారింపును సొంతం చేసుకుంది. తాజాగా ఈ బొద్దుగుమ్మ‌కు ఇంటి ఓన‌రు వేధింపుల‌కు గురి చేస్తున్నాడంటూ చేస్తున్నాడంటూ చెన్నై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. చెన్నైలో ‘నమిత’ను ఆమె అద్దెకు ఉంటున్న ఇంటి ఓనరు వేధిస్తున్నాడంటూ.. పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో పాటు దీనిపై ఆమె కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది.

తాను ప్రతి నెలా ఇంటి అద్దె ఠంచన్‌గా చెల్లిస్తున్న‌ప్ప‌టికీ … ఇంటి ఓనరు తనను ఇళ్లు ఖాళీ చేయమని వేధిస్తున్నారని ఆమె త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. తెలుగు, తమిళ్‌, హిందీ సినిమాల్లో హీరోయిన్‌గా పనిచేసిన ‘నమిత’ తమిళనాడులోని ఓ రాజకీయ పార్టీకి కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రతి నెల త‌న ఇంటికి రూ.15000/-లు అద్దె చెల్లిస్తున్నానని, ఇప్పటికిప్పుడు హఠాత్తుగా ఇళ్లు ఖాళీ చేయమని ఇంటి ఓనర్‌ ఆమెను వేధిస్తున్నారట. అయితే కోర్టు ఆమెను ఈ నెల 12వ తేదీ వరకు ఆ ఇంటిలోనే ఉండవచ్చని స్ప‌ష్టం చేసింది. ఇక ఆ త‌రువాత కోర్టు సూచ‌న‌ల మేర‌కు ఎటువంటి నిర్ణ‌యం తీసుకుని అదే ఉంటుందా.. లేక ఇల్లు మారుతుందా అనేది తెలియాలంటే ఈనెల 12వ‌ర‌కు వేచి చూడాలి.

Leave a Reply

*