జగన్‌లా పుట్టాల‌ని ఉంది : వీవీ వినాయక్

VV Vinayak, puri Jagan, Jagan, Vinayak

టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ మాస్ డైరెక్ట‌ర్ ఎవ‌రు అంటే వెంట‌నే గుర్తుకు వ‌చ్చే డైరెక్ట‌ర్ వీవీ వినాయ‌క్‌. స‌హ‌జంగా ప్ర‌తివారు తాము చేసే ప‌నిలో ఇబ్బందులు తెలియ‌డం వ‌ల్ల నెక్స్ట్ జ‌న్మ‌లో ఈ ప‌నులు ప‌గ‌వాడికి కూడా ఉండ‌కూడ‌ద‌నుకుంటూ ఒక్కోస‌మ‌యంలో నొచ్చుకుంటుంటారు. కానీ.. డైరెక్ట‌ర్ వీవీ వినాయ‌క్ మాత్రం డేరింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ (జ‌గ‌న్‌)లా నెక్స్ట్ జ‌న్మ‌లో పుట్టాల‌ని కోరుకుంటున్న‌ట్టు మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టాడు. తాజాగా మెగాస్టార్ 150వ సినిమా ‘ఖైదీ నంబర్ 150’తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ వీవీ వినాయ‌క్ నిలిచారు. మెగా అభిమానులతో పాటు ఎంతో మంది సినీ అభిమానులు వినాయక్ సినిమాపై ఎన్నో ఆశలు, అంచనాలు పెట్టుకున్నారు.. పెంచుకుంటున్నారు.

వీవీ వినాయక్ ఇటీవల ‘ఖైదీ’ సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. తనతో పాటే కెరీర్ స్టార్ట్ అయిన మరో ఇద్దరు డైరెక్టర్లతో తనకున్న అనుబంధాన్ని త‌న మాట‌ల ద్వారా ఆ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆ ఇద్ద‌రు డైరెక్ట‌ర్లు ఎవ‌రో తెలుసా.. ఒక‌రు ‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ప్ర‌పంచ స్థాయికి తెలిసేలా చేసిన దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి. మ‌రో ద‌ర్శ‌కుడు ఆరు నెలల్లోనే అద్భుతమైన సినిమా తీసిపడేసే సంచ‌ల‌న డైరింగ్ ద‌ర్శ‌కుడు పూరీ జగన్నాధ్. ఈ ఇద్దరి గురించి వినాయక్ త‌న మాట‌ల్లో ఏం చెప్పారో మీరూ చూడండి. ‘‘మేం ముగ్గురం చాలా బాగా క‌లిసి ఉంటాం. రాజమౌళి గారితో నేను కలవడం ఫ్యామిలీ గ్యాద‌రింగ్‌గా ఉంటుంది. చాలా సరదాగా ఉంటాం. రాజమౌళి గారికి కానీ, కీరవాణి గారికి కాని నేనంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా నేను వాళ్ల ఇంటికి వెళ్తే.. ‘హే వినయ్ గారు వచ్చారు’ అని చాలా ఆనందంగా ఫీలవుతుంటారు. నాకది చాలా ఇష్టం. అలా ఆప్యాయ‌త‌గా అలా అని పిల‌వ‌డం చాలా ఇష్టంగా భావిస్తాను. జ‌గన్‌లో ఏంటంటే..

రాజమౌళిగారు కొంచెం కూల్‌గా ఉంటారు. కానీ జగన్ అలా కాదు. నాకు నచ్చేది ఏంటంటే.. లోలో ఉన్నప్పుడు జగన్‌ను తలచుకోవాలనిపిస్తుంది. ఎంద‌కంటే ఆయ‌న‌కు అసలు భయం కానీ, కేర్ కానీ ఏమీ ఉండదు. ఎప్పుడూ మంచి బిందాస్‌గా ఉంటాడు. సో.. మళ్లీ జన్మంటూ ఉంటే జగన్‌లా పుట్టాలి.’’ అని అంటూ తన సహ డైరెక్టర్ల గురించి వినాయక్ స‌ర‌దా.. స‌ర‌దాగా ముచ్చటించారు.

Leave a Reply

*