సెక్స్ వ‌ల్ల‌ మహిళలకు మాత్ర‌మే క‌లిగే లాభాలు ఇవే..

Woman, Man, Girls, Boys, LifeStyle, Helth Tips After marriage, Helth Tips

ప్ర‌తి ఒక్క‌రికీ శృంగారం అవ‌స‌ర‌మే కాదు.. ఆరోగ్యప‌రంగా కూడా చాలా మంచిది అనే విష‌యం చాలామంది వైద్య నిపుణులు సూచించిన సంగ‌తి తెలిసిందే.. ఒక క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో పాల్గొనే సెక్స్‌లో మరింత ప్ర‌యోజ‌నాలు దంప‌తుల‌కు క‌లుగుతాయ‌ని సూచించారు. శృంగారం వ‌ల్ల ఇటు శారీర‌కంగాను, మాన‌సికంగానూ వేల‌కొద్ది లాభాలు ఉన్నాయి. సెక్స్ వ‌ల్ల లాభాల‌ను చెప్పుకోవాలంటే రోజంతా కూర్చున్నా త‌ర‌గ‌న‌న్ని లాభాలు ఉన్నాయి. అన్ని లాభాల గురించి అవ‌స‌రం లేకపోయినా కేవ‌లం సెక్స్ వ‌ల్ల‌ మహిళలకు లభించే ఒక గొప్ప లాభం గురించి ఇప్పుడు ఓసారి తెలుసుకుందాం. కెనడాలోని మెక్ గిల్ యూనివర్సిటిలో ఇటివలే జరిగిన ఓ పరిశోధన ప్రకారం సెక్స్ వ‌ల్ల మ‌హిళల మెదడుని, జ్ఞాపకశక్తిని చురుకుగా మారుస్తుందట. ఈ ప‌రిశోధ‌న కోసం 18-29 మధ్య వయసులో ఉన్న 78మంది అమ్మాయిలను తీసుకున్నారు.

వారంతా రెగ్యులర్ గా సెక్స్ లో పాల్గొనేవారే. వీరి మెదడు పనితనాన్ని, జ్ఞాపకశక్తిని, పజిల్ వంటి ఒక కంప్యుటర్ గేమ్ ద్వారా పరీక్షించార‌ట‌. దీంతో వారు పదాలని గుర్తుపెట్టుకునే సామర్థ్యం ఈ అమ్మాయిల్లో బాగా పెరిగినట్లు పరిశోధకులు తేల్చార‌ట‌. రెగ్యులర్ సెక్స్ వ‌ల్ల హిప్పోకంపాస్ లో కొత్త టిష్యులు పుట్టుకోస్తాయట. అందుకే మెదడు పదాల్ని గుర్తుపెట్టుకోవడంలో మరింత చురుకుగా, చాక‌చ‌క్కంగా అవ‌స‌రానికి అనుగుణంగా చ‌క్క‌గా పనిచేసిందని, హిప్పోకంపాల్ ఫంక్షన్స్ చురుకుగా ఉన్నాయని పరిశోధకులు ఒక జర్నల్ లో అందించిన నివేదిక‌లో చెప్పుకొచ్చారు. మ‌రెందుకు ఆల‌స్యం ప్ర‌తిరోజు సెక్స్‌లో పాల్గొని ఆడ‌వారు జ్ఞానాన్నికూడా సంపాదించుకోవ‌చ్చ‌న్న‌మాట‌.

Leave a Reply

*