అమ్మాయిల న‌గ్న వీడియోలు తీసి అడ్డంగా బుక్క‌యిన బీటెక్ కుర్రాడు

Btech Student, Boys, Girls, Hidden Cam

చ‌దువుకున్న వాళ్లు త‌న ప‌రిధిలో చేసే మంచి ప‌నులను అంద‌రూ ప్రోత్స‌హిస్తారు. అదేవిధంగా వ‌క్ర‌మారాన్ని ఎంచుకుంటే అంద‌రూ తిట్టిపారేస్తారు. అయితే ఏ ఏజ్‌లో చేయాల్సిన ప‌నులు ఆ ఏజ్‌లో చేయాల‌ని పెద్ద‌లు చెబుతుంటారు. ఈ నేప‌థ్యంలోనే ఓ బీటెక్ చ‌దివే నిఖిల్ అనే కుర్రాడు. చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ కూడా చేస్తుంటాడు. ఓ వైపు చ‌దువుకుంటూ షార్ట్ ఫిలిమ్స్ తీయ‌డంతో అంద‌రూ మెచ్చుకోద‌గిన ప‌నులు చేస్తున్నాడ‌ని అంద‌రూ అనుకున్నారు. బుద్ది గ‌తి త‌ప్పింది. వయసుకు మించిన అతి తెలివి ప‌నులు చేసి అడ్డంగా పోలీసుల‌కు బుక్క‌య్యాడు. ఇంతకీ ఆ కుర్రాడు ఏం చేశాడో తెలిస్తే షాకవ్వడం ఖాయం.

అస‌లు విషయానికొస్తే..ఫేస్ బుక్ లో ఫేక్ ఐడీలను క్రియేట్ చేసి అమ్మాయిలతో మాట మాటా కలుపుతుంటాడు. ఆ తరువాత సినిమా, షార్ట్ ఫిలిమ్స్ లో ఛాన్స్ ఇప్పిస్తాను అంటూ మ‌భ్య‌పెడుతుంటాడు. షార్ట్ ఫిలిమ్‌లో ఓ పాత్ర ఉందంటూ అని చెప్పి పిలిపించుకొని ఆడిషన్స్, ఫోటో షూట్ అంటూ బట్టలు మార్చుకోమని సూచిస్తుంటాడు. ఆ సమయంలో వాళ్ళు బట్టలు మార్చుకుంటూ ఉండగా సీక్రెట్ కెమెరా అమ‌ర్చి వీడియో తీస్తాడు. ఇక ఆ త‌రువాత ఆ వీడియోలను అడ్డం పెట్టుకొని డబ్బు కోసం వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయ‌డం మొదలు పెడుతాడు. అలా చాలా మంది అమ్మాయిలు నిఖిల్ దగ్గర మోసపోయిన వాళ్ళే. ఈ నేప‌థ్యంలోనే ఒక అమ్మాయి మాత్రం కాస్త ధైర్యం చేసి జరిగినదంతా పోలీసులకు చెప్పింది. ఇక పోలీసులు రంగంలోకి దిగి విచార‌ణ చేప‌ట్ట‌గా.. మరి కొన్ని నిజాలు బయటపడ్డాయి.

ఇలా షార్ట్ ఫిల్మ్ లో ఆఫర్ ఇప్పిస్తానని రూమ్‌కి పిలిపించుకొని చాలా మంది అమ్మాయిలు బట్టలు మార్చుకుంటున్న సమయంలో వీడియోలు తీసేవాడనే విష‌యం బ‌య‌ట‌ప‌డింది. దీంతో మరి కొందరు బాద్యులు కూడా వచ్చి నిఖిల్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయ‌డంతో నిందుతున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంతవరకు షాపింగ్ మాల్‌ వంటి ప్రదేశాల్లో సీక్రెట్స్ కెమరాల ద్వారా బట్టలు మార్చుకునే సమయంలో షూట్ చెయ్యడం మనం గ‌మ‌నించ‌డం తెలిసిందే.. కానీ ఇప్పుడు నిఖిల్ వల్ల ఇలా కూడా చేస్తున్నారని తెలిసి అమ్మాయిలు ఉలిక్కిపడుతున్నారు. జ‌ర‌భ్ర‌దంగా అమ్మాయిలు ఉండాల్సిందేన‌న్న‌మాట‌.

Leave a Reply

*