‘అమ్మ‌’ మేనకోడలు సంచలన వ్యాఖ్యలు

deepa sensational comments jayalalitha, Deepa, jayalalitha Deepa, jayalalitha, jayalalitha With Deepa

త‌మిళ‌నాడు ముఖ్యమంత్రిగా అశేష జ‌నాద‌ర‌ణ పొందిన అమ్మ జ‌య‌ల‌లిత క‌న్నుమూసింది. ఇక ఆమె మృతితో ఆమె వారసత్వం కోసం సాగుతున్న ప్రయత్నాల్లో కొత్త కోణంలో ఓ వార్త బయటకు వచ్చింది. అన్నాడీఎంకే అధినేత్రి జ‌య‌ల‌లిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స‌మ‌యంలో.. తానే ఆమె రాజకీయ వారసురాలంటూ జ‌య మేన‌కోడు దీప అపోలో ఆసుపత్రి వద్ద హడావుడి చేసిన సంగతి అంద‌రికీ తెలిసిన విష‌య‌మే.. అప్పుడు ఆమె మీడియా ముందుకు వ‌చ్చి.. అమ్మ తమ కుటుంబ సభ్యురాలని.. ఆమెను కలుసుకోకుండా తనను ఎందుకు ఆపుతున్నారంటూ భద్రతా సిబ్బందిపై హ‌డావుడి చేసింది. ఈ వ్యవహారంపై కాస్తంత హడావుడి జరిగిన అనంత‌రం. ఆమెను లోపలికి భ‌ద్ర‌తా సిబ్బంది అనుమతించారు. అయితే.. ఆమె అమ్మ వద్దకు వెళ్లలేదనే చెబుతారు. తాజాగా అమ్మ అంతిమ సంస్కారాల్ని జ‌య స్నేహితురాలైన శశికళ పూర్తి చేయడంపై దీప తీవ్ర ఆవేదన వ్యక్తం చ‌సింది.

ఓ మహిళ అంత్యక్రియలు నిర్వహించడం తాను ఎప్పుడూ చూడలేదంది. ఇంకా ఆమె మాట్లుడూత జయలలిత మరణంలో చాలానే అంతరంగిక విషయాలు దాగి ఉన్నట్టుగా వెల్లడించారు. త్వరలోనే తాను నోరు విప్పి.. చాలా విషయాలు మీడియా మందు బయటపెట్టనున్నట్లుగా వెల్లడించింది. అమ్మ సొంత అన్న కుమార్తె దీప. నిజానికి మొద‌టిలో వారు అమ్మతోనే ఉండేవారు. త‌రువాత జయతో వచ్చిన తగాదాల నేప‌థ్యంలో వారు బయటకు వెళ్లిపోయారు. పోయెస్ గార్డెన్ లో ఉన్న సమయంలోనే దీప జన్మించింది. రెండు కుటుంబాల మధ్య వ‌చ్చిన విభేదాలు వ‌ల్ల వారిని అమ్మ దూరం పెట్టారు.

2013లో జ‌య అన్న భార్య (వదిన) మృతి చెందిన‌ప్పుడు కూడా అమ్మ వెళ్లలేదు. తర్వాత మేనకోడలి దీప పెళ్లి జరిగినప్పుడు కూడా జయలలిత వెళ్లలేదు. అయితే.. తన ఇంటికి వచ్చిన కొత్త దంపతుల్ని ఆశీర్వదించి.. దీపకు ఒక ఫ్లాట్ కూడా బహుమతిగా ఇచ్చినట్లుగా చెబుతుంటారు. అయితే ప్రస్తుతం భర్తతో దూరంగా ఉంటున్న దీప.. అమ్మకు అసలు సిసలు వారసురాలిగా కొన‌సాగందుకు విపరీతంగా ప్రయత్నాలు షురూ చేస్తుంద‌ని అంద‌రూ అనుకోవ‌డం గ‌మ‌నార్హం.

Leave a Reply

*