13 ఏళ్ల బాలికపై ఇద్ద‌రు యువ‌కుల‌ అఘాయిత్యం

13 years girl, Boys, Girls,

దేశ రాజ‌ధానిలో మ‌రో అత్యాచారం సంఘ‌ట‌న‌ చోటు చేసుకుంది. నిత్యం వార్త‌ల్లో నానుతూ.. అత్యాచారాల‌కు, హ‌త్య‌ల‌కు నిల‌యంగా మారుతోంది. అనేక ఘోరాతి ఘోర‌మైన సంఘ‌ట‌న‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారి సోష‌ల్‌మీడియాలో నిలుస్తోంది. అత్యాచారాల నిరోధానికి నిర్భ‌య చ‌ట్టం వంటి క‌ఠిన చ‌ట్టాలు అమ‌లు చేస్తున్న‌ప్ప‌టికీ రోజురోజుకీ పెచ్చుమీరుతున్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీ న‌డిబొడ్డున ఓ బాలికపై అత్యాచారం జరిగింది. ఆనంద్‌ ప్రభాత్‌ ఏరియాలో ఓ పబ్లిక్‌ టాయ్‌లెట్‌లో ఇద్దరు యువకులు 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారు. బాలిక షాపున‌కు వెళ్లి తిరిగి వస్తుండగా పబ్లిక్ టాయ్‌లెట్‌ లోకి వెళ్లింది. అదే సమయంలో ఇద్దరు యువకులు ఆ బాలికను వెంబడించి టాయ్ లెట్లోనే అత్య‌చారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన డిసెంబర్‌ 31న చోటుచేసుకుంది.

అయితే బాధితురాలు ఈ విషయం ఎక్కడ బయటపడి ప‌రువుపోతుంద‌ని భయపడి ఎవరికి చెప్పలేదు. అయితే ఆమెకు తీవ్ర కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రిలో పరీక్షలు చేయగా అసలు విషయం బ‌య‌ట‌ప‌డింది. వెంట‌నే పోలీసులు సెక్షన్‌ 376 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా నిందితల్లో ఒకరు బాల నేరస్తుడని స్ప‌ష్ట‌మ‌యింది. ఈ విష‌యంలో మాత్రం బాల నేర‌స్తుడిగా త‌క్కువ శిక్ష వేయాల‌నే ఆంక్ష‌లు ఉండ‌డం వ‌ల్ల కొంత‌మంది బ‌య‌ట‌ప‌డుతున్నారు. ఇటువంటి సంఘ‌ట‌న‌లపై ప్ర‌భుత్వాలు మ‌రింత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని ప్ర‌జ‌లు కోరుకుంటున్నారు.

Leave a Reply

*