ఎట్ట‌కేల‌కు టీటీడీ మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డి అరెస్ట్

TTD Member Sekhar Reddy Arrusted, TTD Member Sekhar Reddy, Sekhar Reddy Arrusted, Sekhar Reddy,

తమిళనాడు అవినీతి తిమింగలం క‌థ ఓ కొలిక్కి వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు టీటీడీ మాజీ సభ్యుడు, కాంట్రాక్టర్ శేఖర్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. ఈ విష‌యంపై ఆయనకు న్యాయస్థానం జనవరి 3వ తేదీ వరకు రిమాండ్ విధించింది. త‌మిళ‌నాడు సీఎంగా అశేష జ‌నాద‌రణ‌ పొందిన జయలలిత మరణంతో విషాదంలో ఉన్న స‌మ‌యంలో ఇటీవ‌ల‌ చెన్నైలోని తెలుగు వ్యాపారవేత్తల నివాసాల్లో ఐటీ శాఖ సోదాలు సంచలనం చేపిన సంగ‌తి తెలిసిందే.. చెన్నైలో ముగ్గురు తెలుగు వ్యాపారవేత్తలు శేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రేమ్ రెడ్డి ఇళ్లలో ఇటీవ‌ల 60 మంది ఐటీ అధికారులు తనిఖీలు చేప‌ట్టి అబ్బుర‌ప‌రిచే రీతిలో అక్ర‌మ సంపాద‌న‌, కేజీల కొద్దీ బంగారం బ‌య‌ట‌ప‌డింది.

దివంగ‌త మాజీ సీఎం జయలలిత, రామ్మోహన్ రావుకు అత్యంత సన్నిహితుడిగా శేఖర్ రెడ్డి ఉండేవారు. ఆయన ఇంట్లో ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో పూర్తి వివ‌రాలు.. రూ. 181 కోట్ల నగదు, 117 కిలోల బంగారం బ‌య‌ట‌ప‌డింది. ప‌ట్టుబ‌డిన‌ వాటిలో రూ. 106 కోట్ల వరకు కొత్త 2 వేల నోట్లే ఉండ‌డం విశేషం. నేరుగా ఆర్బీఐ నుంచే శేఖర్ రెడ్డికి కొత్త నోట్లు వచ్చినట్టు సీబీఐ అధికారులు భావిస్తున్నారు. శేఖర్ రెడ్డితో పాటు ఆయన అనుచ‌రుగా ఉన్న శ్రీనివాసులు, ప్రేమ్ కుమార్‌ను కూడా సీబీఐ అరెస్టు చేసింది. శేఖ‌ర్‌రెడ్డిపై ఈ కేసులో ఐపీసీ 120బీ, 409, 420 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నోట్ల రద్దు అనంత‌రం ఐటీ అధికారులు దేశ వ్యాప్తంగా నిర్వహించిన విస్తృత తనిఖీల్లో శేఖర్‌రెడ్డి బండారం బ‌య‌ట ప‌డింది.

ప్ర‌స్తుతం శేఖర్‌రెడ్డి వాంగ్మూలంతోనే తమిళనాడు సీఎస్ రామ్మోహన్‌రావు ఇంటిపై బుధవారం ఐటీ అధికారులు దాడులు నిర్వహించి అతడి దగ్గర ఉన్న అక్రమ సంపదను స్వాధీనం చేసుకుని దేశంలో సంచ‌ల‌నంగా మారింది. ఈ దాడులు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వంపై విప‌రీత‌మైన ప్ర‌భావం చూప‌బోతుంద‌ని స‌మాచారం. మ‌ఖ్యంగా సీఎం ప‌న్నీర్ సెల్వం అనుమ‌తితోనే సీఎస్ రామ్మోహ‌న్‌రావు ఇంటిపై దాడులు జ‌రిగాయ‌ని చెబుతున్నారు.. జ‌య‌ల‌లిత వార‌స‌త్వంగా సీఎం పీఠంపై క‌న్నేసిన శ‌శిక‌ళకు ఇటువంటి ప‌రిణామాలు ఇబ్బంది క‌లిగించేవిగా క‌నిపిస్తున్నాయి. ఫైన‌ల్‌గా సీఎం పీఠంపై శ‌శిక‌ళ కూర్చుంటుందా.. లేక ప‌న్నీర్‌ సెల్వం పూర్తిస్థాయిలో అధికారంతో పాల‌న సాగిస్తాడా అనే ఊహాగానాలు మొద‌ల‌య్యాయి.

Leave a Reply

*