‘గాలి’కి మ‌ళ్లీ జైలు త‌ప్ప‌దా ?

Gali Janardhan Reddy Again to Jail, Gali Janardhan Reddy, Gali Janardhan Reddy jail

క‌ర్నాట‌క రాష్ట్ర మైనింగ్ అక్ర‌మ వ్యాపారిగా మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఓ సారి జైలు జీవితం గ‌డిపి వ‌చ్చిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే.. తాజాగా మ‌ళ్లీ జైలు జీవితం త‌ప్ప‌దా ! అంటే త‌ప్ప‌ద‌నే అభిప్రాయాన్ని ప‌లువురు సూచిస్తున్నారు. తాజాగా త‌న ముద్దుల కుమార్తె వివాహాన్ని చాలా వైభ‌వంగా.. సినీ హీరోయిన్ల డాన్సుల‌తో, సింగ‌ర్ల పాట‌ల‌తో… కావ‌ల‌సిన ర‌కం ఫుడ్ చెప్ప‌డానికి ఒక‌టేంటి అన్నింటిలోనూ బెస్ట్ అనిపించేలా .. పెద్ద నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో కూడా వంద‌ల కోట్లు ఖ‌ర్చుపెట్టి ఘ‌నంగా పెళ్లి జ‌రిపించాడు. ఇక ఇందులో ఆశ్చ‌ర్యం ఏముంది అనుకుంటున్నారా.. అలా అనుకుంటే పొరపాటే.

దేశంమంతతా పెద్ద నోట్లు రద్దు ప్రకటించిన అనంత‌రం కూడా గాలికి అన్ని కోట్లు ఎలా వచ్చాయి అనేది అందరి ప్రశ్న. గాలి ఇంట పెళ్లి గురించి ఆ మధ్య కాలంలో అవినీతి నిరోధకశాఖ అధికారులు ఓ సారి రైడ్ కూడా నిర్వహించారు. ఆ సమయంలో గాలి చూపించిన లెక్కలు కొన్ని పొంతన లేకపోవడంతో మరో సారి పరిశీలించాల‌నే ఆలోచనలో ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే..ఈ పరిస్థితుల్లో గాలికి అన్ని కోట్ల రూపాయలు పెళ్లి స‌మ‌యంలో ఎలా వచ్చాయి అనే విషయం తాజాగా బయట పడ్డట్టు తెలిసింది. గాలి జనార్ధన్ రెడ్డి త‌న సన్నిహితుల ద్వారా పెద్ద నోట్ల మార్పిడి జరిపినట్టు విష‌యం బ‌య‌ట‌ప‌డింద‌ట‌. అదెలా అంటే.. నగదు మార్పిడి జరిపిన సమయంలో కొంత అమౌంట్ తక్కువ వచ్చిందని, అలా ఎందుకు జరిగిందో నిజం చెప్పాల్సిందిగా నోట్ల మార్పిడికి సాయ‌ప‌డిన ఓ రెవెన్యూ అధికారి డ్రైవర్ కు గాలి అనుచరుల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయట.

ఈ విష‌యంపై, బెదిరింపుల‌కు మనస్తాపానికి గురైన డ్రైవర్ రమేష్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక డ్రైవ‌ర్ రాసిన సూసైడ్ నోట్ లో గాలి బాగోతం మొత్తం బ‌య‌ట‌ప‌డింద‌ని టాక్‌. బళ్ళారిలో 20 శాతం కమిషన్ తో దాదాపు రూ. 100 కోట్ల వరకు నోట్ల మార్పిడి జరిపారట గాలి. ఈ విషయాన్ని సదరు డ్రైవర్ బయట పెట్టడంతో, ఇప్పుడు గాలి మెడకి మళ్ళీ ఉచ్చు బిగించుకునే సూచనలు క‌నిపిస్తున్నాయ‌ట‌. ఈ ఆధారాలు నిజమ‌ని తేలితే మ‌ళ్లీ గాలికి జైలు త‌ప్ప‌దు.

Leave a Reply

*