కెప్టెన్సీకి గుడ్‌బై : ధోనీ సంచలన నిర్ణయం

MS Dhoni, Dhoni, MS Dhoni videos

భారత వన్డే, టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పి అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురిచేశారు. ఈ షాకింగ్ నిర్ణ‌యంతో అన్నిఫార్మాట్ల‌కు గుడ్‌బై చెప్పిన‌ట్ట‌యింది. ఇప్పటికే టెస్ట్ క్రికెట్ కెప్టెన్సీని కోహ్లీకి అప్పగించిన సంగతి తెలిసిందే. తాజాగా వన్డే, టి20 క్రికెట్ ఫార్మట్లకూ గుడ్‌బై చెప్పడంతో పూర్తిగా కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పారు. ఇక వన్డే, టి20 క్రికెట్ కెప్టెన్సీ బాధ్యత కోహ్లీకి అప్పగిస్తారని స‌మాచారం. గ్రేట్ ఫినిషర్‌గా పేరొందిన ధోనీ ‘కెప్టెన్ ఇన్నింగ్స్‌’నూ అంతే త్వ‌ర‌గా సంచలనంగా ముగించాడు. 2004 సంవ‌త్స‌రంలో బంగ్లాదేశ్‌తో వన్డేలో టీమిండియాలోకి ప్రవేశించిన ఈ డ్యాషింగ్ బ్యాట్స్‌మన్ మరుసటి సంవత్సరమే టెస్ట్ జట్టులోకి అడుగుపెట్టారు. 2007లో వాల్ ఆఫ్ ఇండియా రాహుల్ ద్రావిడ్ నుంచి కెప్టెన్ బాధ్యతలు స్వీకరించాడు. ధోనీ సార‌థ్యంలో37 ఏళ్ల వ‌య‌సులోనే సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా పేరుతెచ్చుకున్నారు. ధోనీ సారధ్యంలోనే టీమిండియా 2007లో టీ20 ప్రపంచ కప్, 2011లో వ‌ర‌ల్డ్‌ కప్, 2013లో ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలు సాధించింది.

ఈ మూడు ట్రోఫీలు సాధించిన ఏకైక కెప్టెన్‌గా ధోనీ చ‌రిత్ర‌లో నిలిచాడు. 2011 ప్రపంచ కప్ ‌ఫైనల్లో 79 బంతుల్లో 91 పరుగులు సాధించిన ధోనీ ఇన్నింగ్స్ క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేని తీపిజ్ఞాప‌కాల‌ను అందించాడు. 40 ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియాను వైట్‌వాష్ చేసిన కెప్టెన్ కూడా ఈ జార్ఖండ్ డైనమైటే ఘ‌న‌త‌ను సాధించాడు. ఓ వైపు టెస్ట్ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ సూపర్ సక్సెస్ అయ్యాడు. ఈ నేపథ్యంలో ధోనీకి కత్తి మీద సాము అని వ్యాఖ్యానాలు వినపడుతున్న సమయంలోనే వన్డే, టీ20 కెప్టెన్సీకి గుడ్ బై చెప్పి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు.

Leave a Reply

*