తెలంగాణ‌లో రేవంత్‌రెడ్డి కొత్త పార్టీ పేరు ఇదే.. ?

Revanth Reddy New Party in Telangana, Revanth Reddy in Telangana, Revanth Reddy New Party, Revanth Reddy

తెలంగాణంలో పులిబిడ్డ అని టీడీపీ నాయ‌కుడుగా వెలుగొందుతున్న రేవంత్‌రెడ్డిని ప్ర‌జ‌లు ముద్దుగా పిలుచుకుంటారు. ఆంధ్రప్రదేశ్ విభ‌జ‌న త‌రువాత తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రసిడెంట్ గా కేసీఆర్ ప్రభుత్వాన్నిరేవంత్ చాలా బాగా ప్రశ్నిస్తున్నాడు. అయితే టీ టీడీపీలో ప్రస్తుతం పవర్ ఫుల్ లీడర్ ఎవ‌రైనా ఉన్నారా అంటే అది ఒక్క రేవంత్ మాత్రమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజా సమాచారం ప్రకారం ఈయన కూడా టీడీపీకి బాయ్ బాయ్ చెప్తున్నాడా అంటే అవుననే సమాధానం స్ప‌ష్ట‌మ‌వుతుంది. రానున్న‌ కాలంలో తెలంగాణలో టీడీపీకి పెద్దగా ప్రాముఖ్యం ఉండ‌ద‌ని ముందుగానే రేవంత్ గ్ర‌హించాడ‌ని అర్ధ‌మ‌వుతుంది. భ‌విష్య‌త్‌లో కేసీఆర్ కు గట్టి పోటీ ఇవ్వడానికి సొంత పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నాడ‌ని టాక్ వినిపిస్తోంది.

ఈ నేప‌థ్యంలోనే తెలంగాణ జేఏసీ కన్వీనియర్ కోదండరామ్ ఇప్ప‌టికే సొంత పార్టీ పెడుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఎన్ని కొత్త పార్టీలు అవతరించినా, ఎంత‌మంది నాయ‌కులు ఉన్నా స‌రే.. కేసీఆర్ ని ప్రశ్నించే సత్తా, అంత దమ్ము మరొకరికి లేందంటూ పలువురు రాజ‌కీయ నాయ‌కులు భావిస్తున్నారు. ఈ విష‌యాల‌న్నీ గ్ర‌హించిన రేవంత్ సొంతంగా పార్టీ పెట్టే ఆలోచ‌న చేస్తున్నాడట. ఇంతకీ ఆయన పార్టీ పేరు ఏం పెడుతున్నారో తెలుసా..’వీర తెలంగాణ’. అని.. అవును..తెలంగాణలో చిన్న పిల్లాడిని అడిగినా తెలంగాణ తెచ్చింది.. మా కేసీఆర్ తాత అని చెబుతున్నారు. ప్రజల్లో అది బలంగా నాటుకుపోయేలా టీఆర్ఎస్ స‌క్సెస్ అయింది. దీనిని ఎలాగైనా తొలగించాలి అనే ఉద్దేశంతోనే పార్టీకి ఆ పేరు ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తుంది.

ఎందరో తెలంగాణ వీరుల ప్రాణత్యాగం వ‌ల్లే తెలంగాణ వచ్చిందని, అంతే కానీ కేసీఆర్ ఒక్క‌డి వ‌ల్లే కాద‌ని,. వాళ్ళ కుటుంబం వల్లనో కాదని ప్రజలకు తెలియచెప్పడానికే రేవంత్ ఇటువంటి పేరును సూచిస్తున్నాడ‌ని టాక్‌. దీన్ని బట్టి చూస్తే..రానున్న కాలంలో తెలంగాణలో టీడీపీ కనుమరుగవ్వడం ఖాయం అని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

Leave a Reply

*