టీటీడీ స‌భ్యుడి ఇంట్లో 90 కోట్లు 100 కిలోల బంగారం ఉంద‌ట !

shekhar reddy black money caught, shekhar reddy

త‌మిళ‌నాడు సీఎంగా అశేష జ‌నాద‌ర‌న పొందిన జయలలిత మరణంతో విషాదంలో ఉన్న చెన్నైలో మరో సంచలన విష‌యం బ‌య‌ట‌ప‌డి హాట్ టాపిగ్గా మారింది. చెన్నైలోని తెలుగు వ్యాపారవేత్తల నివాసాల్లో ఐటీ శాఖ సోదాలు సంచలనం రేపాయి. చెన్నైలో ముగ్గురు తెలుగు వ్యాపారవేత్తలు శేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రేమ్ రెడ్డి ఇళ్లలో గురువారం 60 మంది ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆ ఇంట్లో ఏకంగా ఒకటి కాదు రెండు కాదు పది కాదు ఏకంగా 100 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. బంగారం కాకుండా రూ. 70 కోట్లు నగదు అందులో 10 కోట్లు కొత్త నోట్లు ఉన్నాయ‌ని సమాచారం. ఆ తెలుగు వ్యాపారవేత్తలకు చెందిన వేలూరు కాట్పాడిలోని నివాసాల్లో సోదాలు చేసి ముగ్గురినీ ఐటీ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆ ముగ్గురు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం విలువ రూ. 130 కోట్లగా తేల్చార‌ట‌.

ఈ బంగారంలో కడ్డీల రూపంలో బయటపడిన బంగారం నిల్వలు చూసి అధికారులే క‌ళ్లు తేలేశార‌ట‌. ప్ర‌స్తుతం టీటీడీ సభ్యుడిగా ఉన్న శేఖర్ రెడ్డి.. తమిళనాడులో అధికార అన్నాడీఎంకే పార్టీలో కీలక నేతగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. శేఖ‌ర్‌రెడ్డి ఇసుక, గనుల వ్యాపారాలు చేస్తున్నారు. దివంగత సీఎం జయలలిత నివాసం పోయెస్ గార్డెన్ లోకి సులువుగా వెళ్లగలిగే అతికొద్ది మందిలో ఈయ‌న‌ కూడా ఒక‌రు కావ‌డం విశేషం. ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక శేఖర్ రెడ్డిని టీటీడీ సభ్యుడిగా నియమించారు. చంద్ర‌బాబుతో మాట్లాడి మ‌రీ ఆయ‌న పేరును సిఫార‌సు చేశార‌ట జ‌య‌ల‌లిత‌. నోట్ల ర‌ద్దు త‌ర్వాత దేశంలో ఈ స్థాయి మ‌నీతో అడ్డంగా బుక్ అయిన మొద‌టి నేత ఇత‌నే అనుకోవాలి. మ‌రి, రాబోయే రోజుల్లో మ‌రింత మంది న‌ల్ల‌బాబులు దుమ్ము దులుపుతారేమో వేచి చూడాలి.

Leave a Reply

*