ట్రిపుల్ తలాక్ పై హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

Triple Talaq high court Sensational Result, Triple Talaq

ఇటీవ‌ల కొంత కాలంగా ట్రిపుల్ తలాక్ మీద సాగుతున్న రచ్చ విష‌యాన్ని ఒక కొలిక్కి తెచ్చేలా అలహాబాద్ హైకోర్టు ఓ స్పష్టతతో కూడిన కేసుగా అభివర్ణిస్తున్నారు. ఇస్లాం ఆచార సంప్ర‌దాయ ప్రకారం.. ట్రిపుల్ తలాక్ ను ఆమోదించాలని.. ఇటువంటి మత సంబంధమైన నమ్మకాల విషయాల్లో కోర్టులు.. ప్రభుత్వాలు ఎట్టిప‌రిస్థితిలోనూ జోక్యం చేసుకోవడం సరికాదంటూ మైనార్టీ లా బోర్డు స్పష్టం చేస్తోంది. తమ మత విశ్వాసాల విషయాల్ని ఎందుకు టచ్ చేస్తారంటూ ముస్లిం లా బోర్డు పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేయ‌డం కూడా తెలిసిన‌దే.. ట్రిపుల్ త‌లాక్ అంశం మీద సుప్రీంకోర్టులో కూడా పంచాయితీ న‌డుస్తుంది. ఇదిలా ఉంటే.. అలహాబాద్ హైకోర్టు తాజాగా సంచలన తీర్పును వెల్ల‌డించింది. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. మూడుసార్లు తలాక్ అని చెప్పి విడాకులు ఇవ్వటంఎంతమాత్రం సరికాదని.. ఈ సంప్రదాయాన్ని ప్రోత్సహించటం అంటే.. ముస్లిం మహిళల హక్కుల్ని హరించటమేనని తెలిపింది.

ఓవైపు ముస్లిం మత పెద్దలు.. ట్రిపుల్ తలాక్ పై వస్తున్న విమర్శలు.. అభ్యంతరాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స‌మ‌యంలో.. అందుకు భిన్నంగా హైకోర్టు తీర్పు రావటమే కాదు.. విస్పష్టంగా తమ అభిప్రాయాల్ని తేల్చి చెప్పిన త‌రుణంలో.. రానున్నరోజుల్లో పరిణామాలు ఎలా మారతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. ఇది మ‌త సంప్ర‌దాయ‌మైన‌ప్ప‌టికీ మ‌హిళ‌ల ఆలోచ‌న‌ల‌తో సంబంధం లేకుండా తీసుకునే నిర్ణ‌యంగా ప‌రిగ‌ణించింది. సో.. ఏది ఏమైన‌ప్ప‌టికీ ట్రిపుల్ త‌లాక్‌పై కోర్టు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుని త‌మ అభిప్రాయాన్ని తెలియ‌జేయ‌డంతో ఈ అంశంపై ఓ క్లారిటీ వ‌చ్చిన‌ట్ట‌యింది.

Leave a Reply

*